Petrol Diesel Price Today: కోవిడ్ వ్యాప్తిలోనూ ఆగని పెట్రో పరుగు.. కృష్ణా జిల్లాలో రూ.100.01… మరి మీ నగరంలో…

|

May 27, 2021 | 9:22 AM

Petrol-Diesel Rates Today: దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉన్నా పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తమ పరుగు ఆపడంలేదు. మార్కెట్ ధరలను చూస్తుంటే సెంచరీ కొట్టాలనే ఉత్సాహం కనిపిస్తోంది.  తెలుగు రాష్ట్రాల్లో కూడా సెంచరీ వైపు...

Petrol Diesel Price Today: కోవిడ్ వ్యాప్తిలోనూ ఆగని పెట్రో పరుగు.. కృష్ణా జిల్లాలో రూ.100.01... మరి మీ నగరంలో...
Petrol Price Today
Follow us on

Petrol-Diesel Rates Today: దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉన్నా పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తమ పరుగు ఆపడంలేదు. మార్కెట్ ధరలను చూస్తుంటే సెంచరీ కొట్టాలనే ఉత్సాహం కనిపిస్తోంది.  తెలుగు రాష్ట్రాల్లో కూడా సెంచరీ వైపు పెట్రోల్ పరుగులు పెడుతోంది. పెట్రోల్ వెంటే తాను అంటూ నెమ్మదిగా అక్కడికే నడక మొదలు పెట్టింది డీజిల్ ధర.  అయితే అధికారిక సమాచారం ప్రకారం.. శనివారం నాడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.36గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 92.24గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.66 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.92.61 గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 97.79గా ఉండగా.. డీజిల్ ధర రూ. 93.77గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.12గా ఉండగా.. డీజిల్ ధర రూ.92.84గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.04ఉండగా.. డీజిల్ ధర రూ.92.87 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.91పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 91.81గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 99.80కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్  ధర రూ. 94.09 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 98.60ఉండగా.. డీజిల్ ధర రూ.92.93గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.91లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.94.14 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.01 గా ఉండగా.. డీజిల్ ధర రూ.94.28గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 99.80లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.94.09 లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 93.68గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 84.61 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.94కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.91.87 గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 93.72 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 87.46 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 95.28ఉండగా.. డీజిల్ ధర రూ.89.39 గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.95.80 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.89.70 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.25 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.85.04గా ఉంది.

ఇవి కూడా చదవండి : కోవిద్ పాండమిక్ కారణంగా ఏప్రిల్ నుంచి 577 మంది అనాథలైన చిన్నారులు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెల్లడి

Etela New Profile Pick: ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ మార్చిన ఈటల రాజేందర్‌.. ఇప్పుడు తెలంగాణలో ఇదే పెద్ద చర్చ..

Covaxin Second Dose: నేటినుంచి కొవాగ్జిన్‌ రెండో డోసు..రెండు రోజుల్లో 90వేల మందికి టీకా వేస్తామన్న సింఘాల్‌