Petrol-Diesel Rates Today: వాహనదారులకు షాకిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే…

|

May 18, 2021 | 11:25 AM

Petrol-Diesel Rates Today: దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో రోజు రోజుకు మార్పు కనిపిస్తోంది. ప్రధాన నగరాల్లో చిన్న పాటి మార్పులు కనిపిస్తుండగా... ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే తరహాలో స్వల్ప మార్పులు..

Petrol-Diesel Rates Today: వాహనదారులకు షాకిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే...
Follow us on

Petrol-Diesel Rates Today: దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో రోజు రోజుకు మార్పు కనిపిస్తోంది. ప్రధాన నగరాల్లో చిన్న పాటి మార్పులు కనిపిస్తుండగా… ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే తరహాలో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి.  అన్ని రాష్ట్ర కట్టుబాట్లు కొనసాగిస్తుండటంతో బయట తిరగడానికి ఉత్సాహం చూపించడం లేదు తెలుగు రాష్ట్రాల్లోని జనం. దీంతో పెట్రోల్ వినియోగం కూడా చాలా తగ్గిందని ఇందన కంపెనీల అంచనా…  అయితే అధికారిక సమాచారం ప్రకారం.. మంగళవారం నాడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.50 గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 91.04గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.01 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.91.50 గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 97.28గా ఉండగా.. డీజిల్ ధర రూ. 91.75గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.60గా ఉండగా.. డీజిల్ ధర రూ.91.70గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.66 ఉండగా.. డీజిల్ ధర రూ.91.19  గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.05పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 90.61గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 99.16కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్  ధర రూ. 93.12 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 98.48 ఉండగా.. డీజిల్ ధర రూ.92.44గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.12లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.92.11 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.20 గా ఉండగా.. డీజిల్ ధర రూ.93.16గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 99.16లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.93.12 లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 92.85గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 83.51 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.14కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.90.71 గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 92.92 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 86.356 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 94.69 ఉండగా.. డీజిల్ ధర రూ.88.48 గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.95.94 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.53 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.57 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.83.89  గా ఉంది.

ఇవి కూడా చదవండి:  Horoscope Today: ఈ రాశి వారు చేప‌ట్టే ప‌నులు వాయిదా ప‌డే అవ‌కాశాలున్నాయి.. జాగ్ర‌త్త‌గా ఉండాలి.. నేటి రాశిఫ‌లాలు..

ఆస్పత్రి కారిడార్‌లో డాక్టర్ల డ్యాన్సులు…!! సల్మాన్ ఖాన్ సిటీమార్‌ సాంగ్‌కి అదిరే స్టెప్పులు… ( వీడియో )

Raghu Rama Krishna Raju: సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి రఘురామకృష్ణంరాజు.. నేడు వైద్య పరీక్షలు..