Petrol-Diesel Rates Today: పెట్రోల్, డీజిల్ ధరల పరుగుకు బ్రేకులు పడటం లేదు. ప్రతి రోజు పెరుగుతున్న ఇంధన ధరలు చూసి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారిక సమాచారం ప్రకారం.. బుధవారం నాడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.41గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.42 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.89.92 గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 95.42గా ఉండగా.. డీజిల్ ధర రూ. 89.92 గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.51గా ఉండగా.. డీజిల్ ధర రూ.89.88గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.41 ఉండగా.. డీజిల్ ధర రూ.89.79 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.96 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.36 గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 97.86 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 91.67 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 96.71 ఉండగా.. డీజిల్ ధర రూ.90.57గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.07 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.90.90 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.72 గా ఉండగా.. డీజిల్ ధర రూ.91.56 గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 97.86లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.91.67 లకు లభిస్తోంది.
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 91.80గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 82.36 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.12కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.89.48 గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 91.92 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 85.20 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 93.62 ఉండగా.. డీజిల్ ధర రూ.87.25 గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.85 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.87.31 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 89.77 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.82.74 గా ఉంది.