Petrol-Diesel Price Today: దేశంలో పరుగులు పెట్టిన పెట్రోల్, డీజిల్ ధరలు గత కొన్ని నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక తాజాగా ఇండియన్ ఆయిల్ కంపెనీలు వాహనదారులకు కాస్త ఊరటనిచ్చాయి. పెట్రోల్, డీజిల్ ధరలపై స్వల్పంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 40పైసలు తగ్గించాయి. ఈ తగ్గించిన ధరలు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు రూ.2 వరకు తగ్గే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కానీ క్రమంగా ఈ తగ్గింపు జరగనుందని తెలుస్తోంది. సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర రూ.92.76, ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27, చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24 వద్ద ఉంది. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82 వద్ద ఉంది. ఈ ధరలపై మంగళవారం నుంచి 40 పైసలు తగ్గింది.
. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడంతోపాటు మరికొంత కాలం స్థిరంగా ఉండడంతో ధరలు తగ్గుతాయని భావించారు. గత కొంతకాలంగా ముడి చమురు ధర బ్యారెల్‌కు 95 డాలర్ల కంటే తక్కువగానే ఉంది. ఇంధన ధరల తగ్గుదల 6 నెలలకు పైగా స్థిరంగా ఉన్న తర్వాత వస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 7న చివరిసారిగా ధర తగ్గింపు జరిగింది. అయితే, మే 22 న ప్రభుత్వం పెట్రోల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఆ తర్వాత ఢిల్లీలో పెట్రోల్ రేటు లీటరుకు రూ.96.72కి, డీజిల్ లీటరుకు రూ.89.62కి తగ్గింది.
ఫిబ్రవరి నుంచి రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. క్రూడాయిల్ ధరలు మార్చిలో బ్యారెల్ $139కి చేరుకున్నాయి. ఇది 2008 తర్వాత అత్యధికం. ఇటీవల ఇది బ్యారెల్‌కు $ 85కి పడిపోయింది. ప్రస్తుతం ఇది బ్యారెల్‌కు $ 95 వద్ద ఉంది.
మీరు ఇంట్లో కూర్చొని పెట్రోల్-డీజిల్ రేట్లను తనిఖీ చేయవచ్చు. అన్ని చమురు కంపెనీలు SMS ద్వారా పెట్రోల్, డీజిల్ ధరలను తనిఖీ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తాయి. ధరను తనిఖీ చేయడానికి, ఇండియన్ ఆయిల్ (IOC) వినియోగదారు RSP<డీలర్ కోడ్> అని రాసి 9224992249 నంబర్‌కు పంపాలి. అదే సమయంలో, HPCL వినియోగదారులు 9222201122 నంబర్‌కు HPPRICE <డీలర్ కోడ్> అని టైప్ చేయడం ద్వారా, అలాగే BPCL (BPCL) వినియోగదారులు RSP<డీలర్ కోడ్> అని టైప్ చేయడం చేసి 9223112222కు SMS పంపండి. ధరలను తెలుసుకునేందుకు ఈ లింక్ ద్వారా కోడ్‌ను తెలుసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి