Petrol Diesel Price Today: పెరుగుతోన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల నుంచి కాస్త ఉపశమనం.. స్వల్పంగా తగ్గిన ధరలు..

| Edited By: Team Veegam

Mar 25, 2021 | 11:25 AM

Petrol Diesel Price Today: ఆకాశమే హద్దుగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు గత కొన్ని రోజులుగా కాస్త ఫుల్‌స్టాప్‌ పడినట్లు కనిపిస్తోంది. గత వారం రోజులుగా ఇంధన ధరల పెరుగుదలకు చెక్‌ పడగా.. తాజాగా దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో స్వల్పంగా తరుగుదల..

Petrol Diesel Price Today: పెరుగుతోన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల నుంచి కాస్త ఉపశమనం.. స్వల్పంగా తగ్గిన ధరలు..
Follow us on

Petrol Diesel Price Today: ఆకాశమే హద్దుగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు గత కొన్ని రోజులుగా కాస్త ఫుల్‌స్టాప్‌ పడినట్లు కనిపిస్తోంది. గత వారం రోజులుగా ఇంధన ధరల పెరుగుదలకు చెక్‌ పడగా.. తాజాగా దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో స్వల్పంగా తరుగుదల కనిపించడం విశేషం. దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాల వరకు గురువారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 90.99 (బుధవారం రూ.91.17)గా ఉండగా… డీజిల్‌ ధర రూ. 81.30 (బుధవారం రూ.81.47) వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో గురువారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.40 ఉండగా డీజిల్‌ రూ.88.42 గా ఉంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో గురువారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.92.95 గా ఉండగా, లీటర్‌ డీజిల్‌ రూ.86.29 వద్ద కొనసాగుతోంది.
* కర్నాటక రాజధాని బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 94.04 ఉండగా, లీటర్‌ డీజిల్‌ రూ. 86.21 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

* తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనూ గురువారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలో తగ్గుదల కనిపించింది. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ రూ.94.61 గా ఉండగా.. డీజిల్‌ రూ. 88.67 వద్ద కొనసాగుతోంది.
* తెలంగాణలో మరో ముఖ్య నగరమైన కరీంనగర్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 94.48 గా ఉండగా.. డీజిల్‌ రూ.88.55 వద్ద కొనసాగుతోంది.
* ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే.. విజయవాడలో గురువారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.24 గా ఉండగా.. డీజిల్‌ రూ. 90.76 వద్ద కొనసాగుతోంది.
* ఇక సాగర నగరం విశాఖపట్నంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 97.24 వద్ద ఉండగా.. డీజిల్‌ రూ. 90.76 గా ఉంది.

Also Read: Gold And Silver Price: నేటి మార్కెట్ లో స్థిరంగా ఉన్న పసిడి ధర.. తగ్గిన వెండి.. తెలుగు రాష్ట్రాల్లో ధరల వివరాల్లోకి వెళ్తే..!

Amazon: మొబైల్ కోనుగోలుదారులకు బంపర్ ఆఫర్.. వన్‌ప్లస్‌ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఉచితంగా పొందండి.. అదెలాగంటే..

వినియోగదారులకు షాక్ ఇచ్చిన వోడాఫోన్ ఐడియా.. ఆ రీఛార్జ్ ధరలను భారీగా పెంచిన టెలీకాం సంస్థ..