Petrol, Diesel Prices: వరుసగా ఐదో రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు బ్రేకులు.. ప్రధాన నగరాల్లో ధరలు

|

Jul 22, 2021 | 8:24 AM

Petrol, Diesel Prices: వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు ఐదో రోజు కూడా బ్రేక్ పడింది. గురువారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు..

Petrol, Diesel Prices: వరుసగా ఐదో రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు బ్రేకులు.. ప్రధాన నగరాల్లో ధరలు
Petrol Diesel price Today
Follow us on

Petrol, Diesel Prices: వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు ఐదో రోజు కూడా బ్రేక్ పడింది. గురువారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. చివరగా శనివారం నాడు ధరలు పెంచిన దేశీయ చమురు కంపెనీలు.. ఆదివారం నుంచి నేటి వరకు ఆ ధరల పెరుగుదలకు బ్రేక్ వేసింది. ఇది వాహనదారులకు కాస్త ఊరట అనే చెప్పినా.. భారంగానే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ రూ.100 దాటేసింది. గతంలో వందలోపు ఉన్న ధరలు.. రోజురోజుకు పెరుగుతూ వంద దాటేయడంతో వాహనదారులకు ఇబ్బందిగా మారిపోయింది. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వచ్చాయి. కాగా, వరుసగా పెరిగిన ధరల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 100 దాటింది. ప్రతి రోజు పెట్రోల్‌, డీజిల్‌పై 29 నుంచి 30 పైసలు పెరుగుతూ రాగా, గత ఐదు రోజుల నుంచి ధరలు స్థిరంగా ఉన్నాయి.

గురువారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇలా ఉన్నాయి.

దేశంలోని ప్రముఖ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
న్యూఢిల్లీ – లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 101.84 ఉండగా, డీజిల్‌ రూ. 89.87
ముంబై -లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 107.83 ఉండగా, డీజిల్‌ రూ. 97.45
కోల్‌కతా- పెట్రోల్‌ ధ రూ. 102.08, డీజిల్‌ ధర రూ. రూ. 93.02
చెన్నై – పెట్రోల్‌ ధర రూ. 102.49, డీజిల్‌ రూ. 94.39
బెంగళూరు – పెట్రోల్‌ ధర రూ. 105.25, డీజిల్‌ రూ. 95.26

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్ – పెట్రోల్‌ ధర రూ. 105.83, డీజిల్‌ ధర రూ. 97.96
మెదక్ – పెట్రోల్‌ ధర రూ. 106.30, డీజిల్‌ ధర రూ. 98.40.
వరంగల్ – పెట్రోల్‌ ధర రూ. 105.38, డీజిల్‌ ధర రూ. 97.52.
విజయవాడ – పెట్రోల్‌ ధర రూ.108.11, డీజిల్‌ ధర రూ.99.70
విశాఖపట్నం – పెట్రోల్‌ ధర రూ. 107.07, డీజిల్‌ ధర రూ.98.86,
విజయనగరం – పెట్రోల్‌ ధర రూ.108.34, డీజిల్‌ ధర రూ.99.86

మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధర ఎలా తెలుసుకోవాలి

పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతి రోజు సవరించడం జరుగుతుంది. సవరించిన కొత్త ధరలను ఉదయం 6 గంటలకు విడుదల చేస్తారు. అయితే, సవరించిన పెట్రోల్, డీజిల్ ధరలను ఇంట్లోనే కూర్చుని కేవలం ఒక్క ఎస్సెమ్మెస్ ద్వారా తెలుసుకోవచ్చు. లేదంటే మీ సమీప పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి పెట్రోల్, డీజిల్ ధరను తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ ధరల కోసం వినియోగదారులు.. తమ మొబైల్ నుండి ఆర్‌ఎస్‌పితో పాటు సిటీ కోడ్‌ను నమోదు చేసి 92249 92249 కు మెసేజ్ సెండ్ చేయవచ్చు. దీని ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తెలుసుకోవచ్చు. అదేవిధంగా, బిపిసిఎల్ ఇంధన ధరలు తెలుసుకోవాలంట.. మొబైల్‌లో ఆర్ఎస్‌పిని టైప్ చేసి 92231 12222 కు ఎస్ఎంఎస్ పంపవచ్చు. HPCL ధరల కోసం 92222 01122 కు HPPrice అని టైప్ చేసి SMS పంపవచ్చు.

ఇవీ కూడా చదవండి

Gold and Silver Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. దిగివచ్చిన బంగారం, వెండి ధరలు..!

Washing Machine: బంపర్ ఆఫర్‌.. రూ.4,990కే కొత్త వాషింగ్ మెషీన్ కొనుగోలు చేయండి..!

Home Loan EMI: మీరు గృహ రుణం తీసుకుంటున్నారా..? అయితే ఈఎంఐ భారాన్ని తగ్గించుకోవడం ఎలా..?