Petrol And Diesel Rates: గతకొన్ని రోజుల క్రితం ఆకాశమే హద్దుగా పెరిగాయి పెట్రోల్, డీజిల్ ధరలు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.100కు చేరువైంది. దీంతో వాహనాలను బయటకు తీయాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఇదిలా ఉంటే క్రమంగా పెరుగుతూ వచ్చిన ఇంధన ధరలకు గతకొన్ని రోజులగా మాత్రం బ్రేక్ పడుతూ వస్తోంది. కారణాలు ఏవైనప్పటికీ గడిచిన కొన్ని రోజులుగా మాత్రం ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. సోమవారం దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి.
* దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.91.17గా ఉండగా.. లీటర్ డీజిల్ రూ.81.47 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.57గా ఉండగా డీజిల్ రూ.88.60గా ఉంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.93.11గా ఉండగా.. డీజిల్ రూ.86.45 వద్ద కొనసాగుతోంది.
* కర్నాటక రాజధాని బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.22 కాగా.. డీజిల్ ధర రూ. 86.37 వద్ద కొనసాగుతోంది.
* తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.79గా ఉండగా.. డీజిల్ ధర రూ. 88.86గా నమోదైంది.
* తెలంగాణలో మరో ముఖ్యపట్టమైన వరంగల్‌లో సోమవారం లీటర్ పెట్రోల్ ధర రూ. 94.37గా ఉండగా.. డీజిల్ ధర రూ.88.45 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.49కాగా డీజిల్ ధర రూ. 90.98గా ఉంది.
* సాగర తీరం విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.26 గా నమోదుకాగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.91 వద్ద కొనసాగుతోంది.
Also Read: COVID-19: వ్యాక్సిన్ తీసుకుంటే.. అప్పటివరకూ రక్తదానం చేయొద్దు: ఎన్‌బీటీసీ ఆదేశాలు