Petrol, Diesel Prices Today: స్థిరంగానే పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎలా ఉన్నాయంటే..

|

Feb 12, 2022 | 10:49 AM

Petrol, Diesel Prices Today: ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు (Petrol and Diesel Prices) మళ్లీ భగ్గుమంటాయన్న ప్రచారం సాగుతోంది

Petrol, Diesel Prices Today: స్థిరంగానే పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎలా ఉన్నాయంటే..
Follow us on

Petrol, Diesel Prices Today: ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు (Petrol and Diesel Prices) మళ్లీ భగ్గుమంటాయన్న ప్రచారం సాగుతోంది. అయితే ప్రస్తుతం మాత్రం ఇంధన ధరల్లో (Fuel Rates) ఎలాంటి మార్పులు కనిపించడం లేదు. మూడు నెలల క్రితం పెరిగిన ధరలు అలాగే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నా మన దేశంలో మాత్రం ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతుండడం గమనార్హం. మరి శనివారం (ఫిబ్రవరి 12)న రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మెట్రో నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.92గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.35గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.36గా ఉండగా.. డీజిల్ ధర రూ.94.75గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.99గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.36గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20ఉండగా.. డీజిల్ ధర రూ.94. 62గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.84పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.31గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.31కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.68లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.05 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.18గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.50లకు దొరుకుతుండగా.. డీజిల్ ధర రూ.96.52గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.81గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.86గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.110.61లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.68లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.95.41 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.67 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.40 ఉండగా.. డీజిల్ ధర రూ.91.43గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.01గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.13 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.86.67గా ఉంది.

Also Read:India Corona: దేశవ్యాప్తంగా తగ్గుముఖం పడుతున్న కరోనా.. కొత్తగా 50,407 మందికి పాజిటివ్, 804మంది మృతి

Rowdy Boys: ఓటీటీలో అడుగుపెట్టనున్న రౌడీ బాయ్స్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..

RGV: జగన్ సూపర్ డూపర్ ఒమేగా స్టార్.. కానీ మన హీరోలు మాత్రం.. ఆర్జీవీ వరుస ట్వీట్స్..