Petrol and Diesel Price Today: పెట్రోల్, డీజిల్ ధరల్లో వరుసగా పంతొమ్మిదో రోజూ ఎలాంటి మార్పు లేదు. చమురు కంపెనీల అధికారిక సమాచారం ప్రకారం..
ఢిల్లీలో మంగళవారం లీటర్ పెట్రోల్ ధర రూ.91.17 ఉండగా (గురువారం రూ. 91.17), డీజిల్ ధర రూ.81.47 వద్ద (గురువారం రూ.81.47) కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.57 గా ఉండగా (గురువారం రూ. 97.57 ), డీజిల్ రూ.88.60 (గురువారం రూ.88.60 )గా ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో శుక్రవారం కూడా పెట్రోల్ డీజిల్ ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేవు. లీటర్ పెట్రోల్ ధర రూ. 94.79 (గురువారం రూ. 94.79 ) ఉండగా, డీజిల్ ధర రూ. 88.86 (గురువారం రూ. 88.86 )గా నమోదైంది. ఇక తెలంగాణలో మరో ముఖ్య పట్టణం కరీంనగర్‌లోనూ ఇంధన ధరల్లో చిన్న మార్పులు కనిపిస్తోంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ. 94.88 (గురువారం రూ. 94.92), డీజిల్ రూ. 88.92 (గురువారం రూ. 88.97 )గా నమోదైంది.
ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. విజయవాడలో స్వల్పంగా పెరుగుదల కనిపించింది. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 97.40 (గురువారం రూ.96.95), డీజిల్ ధర రూ. 90.92 (గురువారం రూ.90.50) వద్ద కొనసాగుతోంది. సాగర తీరం విశాఖపట్నంలో కాస్త తగ్గింది. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 89.13 (గురువారం రూ. 96.68 )గా ఉండగా, లీటర్ డీజిల్ రూ. 89.69 (గురువారం రూ.90.90 )గా వద్ద కొనసాగుతోంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో శుక్రవారం లీటర్ పెట్రోల్ ధర రూ. 93.11 ఉండగా (గురువారం రూ. 93.11 ), డీజిల్ ధర రూ. 86.45 (గురువారం రూ. 86.45 ) వద్ద కొనసాగుతోంది. ఇక కర్నాటక రాజధాని బెంగళూరులో ఈరోజు లీటర్ పెట్రోల్ ధర రూ.94.22 (గురువారం రూ. 94.22 ), ఉండగా డీజిల్ ధర రూ.86.37 (గురువారం రూ. 86.37) గా ఉంది.
ఇవి కూడా చదవండి : Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా..