Fuel price today: బాదుడే బాదుడు.. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రో ధరలు.. హైదరాబాద్‌లో సెంచరీకి చేరువలో..

|

Jun 12, 2021 | 7:32 AM

Petrol Diesel price today: చమరు కంపెనీలు వాహనదారులకు చుక్కులు చూపిస్తున్నాయి. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు, వాహనదారులు

Fuel price today: బాదుడే బాదుడు.. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రో ధరలు.. హైదరాబాద్‌లో సెంచరీకి చేరువలో..
Petrol Diesel Prcie
Follow us on

Petrol Diesel price today: చమరు కంపెనీలు వాహనదారులకు చుక్కులు చూపిస్తున్నాయి. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు, వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పెట్రోల్‌ ధరలు వంద మార్క్ దాటాయి. తాజాగా పెట్రోల్‌, డీజిల్ పై 25 పైసలు చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే.. ఇటీవల పలు రాష్ట్రాల ఎన్నికల ముగిసిన నాటి నుంచి దేశంలో పెట్రోల్ ధరలు నిత్యం పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా తాజాగా పెరిగిన ధరలతో.. ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజీల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం.

ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్ ధర రూ.95.85 కి చేరగా.. లీటర్ డీజిల్‌ ధర రూ.86.75 కి చేరింది.
ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.102.04, డీజిల్ రూ.94.15 కు పెరిగింది.
చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.19 ఉండగా.. డీజిల్‌ రూ.91.42 గా ఉంది.
కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.80 గా.. డీజిల్‌ ధర రూ.89.60 గా ఉంది.
బెంగళూరులో బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.99.05 డీజిల్‌ రూ.91.97 గా ఉంది.

తెలంగాణ హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర.99.62, లీటర్‌ డీజిల్‌ రూ.94.57 కు పెరిగింది.
వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర 99.16, డీజిల్ ధర 94.13 గా ఉంది.
ఆంధ్రప్రదేశ్ విజయవాడలో పెట్రోల్ ధర రూ.101.98 గా ఉండగా.. రూ. 96.33 గా ఉంది.
విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 100.78 ఉండగా.. డీజీల్ ధర రూ.95.15 గా ఉంది.

Also Read:

మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. అమలులోకి వచ్చిన మద్యం డోర్ డెలివరీ స్కీమ్…

TV9 Alert: ఆనందయ్య మందుకు డూప్లికేట్..ఆయన శిష్యులం అంటూ దోచేస్తున్న కేటుగాళ్ళు..టీవీ9 పరిశీలనలో విస్తుపోయే నిజాలు!