Petrol And Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకీ సామాన్యుడిగా పెను భారంగా మారుతున్నాయి. పెరగడమే తప్ప తగ్గడం లేదంటూ పైపైకీ దూసుకుపోతున్నాయి. వాహనాన్ని బయటకు తీయాలంటే బెంబేలెత్తిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే దేశంలోని చాలా చోట్ల పెట్రోల్ ధర సెంచరీకి కొట్టేయగా.. ఇప్పుడా వరుసలో డీజిల్ కూడా వచ్చి చేరేట్లు కనిపిస్తోంది. హైదరాబాద్‌లో శుక్రవారం లీటర్ డీజిల్ రూ. 97.20కు చేరింది. ఈరోజు దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.81 గా ఉండగా, డీజిల్ రూ. 89.18 వద్ద కొనసాగుతోంది.
* ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.90 కాగా, డీజిల్ రూ. 96.72 గా ఉంది.
* తమిళనాడు రాజధాని చెన్నై విషయానికొస్తే శుక్రవారం ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 99.80 గా నమోదుకాగా, డీజిల్ రూ. 93.72 వద్ద కొనసాగుతోంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.11 గా ఉండగా, డీజిల్ రూ. 94.54 గా నమోదైంది.
* హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.69 గా ఉండగా, డీజిల్ కూడా పెట్రోల్‌తో పోటీ పడీ మరీ దూసుకుపోతుంది. శుక్రవారం ఇక్కడ లీటర్ డీజిల్ ధర రూ. 97.20కు చేరింది.
* విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.21 గా నమోదుకాగా, డీజిల్ ధర రూ. 99.08 వద్ద కొనసాగుతోంది.
* సాగర నగరం విశాఖపట్నంలో శుక్రవారం లీటర్ పెట్రోల్ ధర రూ. 103.76 వద్ద ఉండగా, డీజిల్ ధర రూ. 97.70 గా నమోదైంది.
Also Read: Suicide: ‘అందంగా లేవు.. లావుగా ఉన్నావు’.. వేరొక పెళ్లి చేసుకుంటానంటూ భర్త టార్చర్.. మహిళ బలవన్మరణం..
Booster Dose: ఆ దేశంలో మూడో డోసు వ్యాక్సిన్ ప్రారంభం.. మళ్లీ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు.. !