AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card EMI: క్రెడిట్ కార్డు బిల్లును ఈఎంఐలోకి మారుస్తున్నారా..? లాభ, నష్టాలు ఇవే..

క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటివారు బిల్లును ఈఎంఐ రూపంలోకి మారుస్తారు. ఇలా మార్చడం వల్ల బిల్లు తగ్గుతుందని, వాయిదాల రూపంలో కట్టవచ్చని అనుకుంటారు. ఇలా చేయడం వల్ల లాభ, నష్టాలు ఏంటి? అనే వివరాలు చూద్దాం.

Credit Card EMI: క్రెడిట్ కార్డు బిల్లును ఈఎంఐలోకి మారుస్తున్నారా..? లాభ, నష్టాలు ఇవే..
అయితే చాలా మంది క్రెడిట్ కార్డు బిల్లును సమయానికి చెల్లించరు. గడువులోగా చెల్లించకుంటే భారీగా పెనాల్టీ పడుతుంది. మరి బాకీ ఉన్న బిల్లును చెల్లించకుంటే ఏవమతుంది? అలాంటి సమయంలో ఏం చేయాలో తెలుసుకుందాం. మీ కార్డును ఉన్న బకాయినీ నెలవారీ పద్దతుల్లో అంటే ఈఎంఐ రూపంలో చెల్లించవచ్చు. మీ బిల్లును ఈఎంఐలోకి మార్చుకోవచ్చు. దీని వల్ల మీ క్రెడిట్‌ కార్డు బకాయిని చెల్లించడంలో సులభం అవుతుంది. లేదా ఆ బకాయిని వేరే కార్డుకు బదిలీ చేసుకుని వ్యక్తిగత రుణంగా చెల్లించే వెసులుబాటు కూడా ఉంటుంది.
Venkatrao Lella
|

Updated on: Nov 22, 2025 | 3:30 PM

Share

ఈ మధ్య అందరూ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారు. క్రెడిట్ కార్డ్ లేనివారంటూ ఎవరూ కనిపించడం లేదు. ఉద్యోగులు, వ్యాపారవేత్తలు అనే సంబంధం లేకుండా సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు ప్రతీఒక్కరూ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారు. అంతలా క్రెడిట్ కార్డ్ వినియోగం అనేది పెరిగిపోయింది. బ్యాంకులు కూడా తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు క్రెడిట్ కార్డులను తెగ జారీ చేస్తున్నాయి. కస్టమర్లకు ఫోన్ చేసి మరీ క్రెడిట్ కార్డు తీసుకుంటే అనేక డిస్కౌంట్స్ ఇస్తామంటూ ఆఫర్లు మీద ఆఫర్లు ఇస్తున్నాయి. ఈ ఆఫర్లకు ఆశపడి క్రెడిట్ కార్డు తీసుకునేవారు కూడా ఉన్నారు. అయితే క్రెడిట్ కార్డువాడేవారు చాలామంది బిల్లు కట్టలేక.. ఆ బిల్లును ఈఎంఐ రూపంలోకి మార్చుకుంటారు. ఇలా మార్చుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయి..? బిల్లును ఈఎంఐ రూపంలో కి మార్చుకోవడం వల్ల సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుందా అనే విషయాలు చూద్దాం.

సిబిల్ స్కోర్ పెరిగే అవకాశం

బిల్లును ఈఎంఐగా మార్చుకున్నప్పుడు.. టైమ్ ప్రకారం ఈఎంఐ చెల్లించాలి. ఇలాంటి సమయంలో మీ సిబిల్ స్కోర్ పెరుగుతుంది. అంతేకాకుండా క్రెడిట్ యుటిలైజేషసన్ రేషియా పెరగకుండా చూసుకోవాలి. ఈ రేషియా 30 శాతంగా ఉంటుంది. దీనిని మించి మీరు ఖర్చు చేస్తే సిబిల్ స్కోర్ పడిపోతుంది. ఇక మీరు ఈఎంఐగా మార్చుకోవడం వల్ల బిల్లు చెల్లించాల్సిన సమయం కూడా పెరుగుతుంది.

నష్టాలు ఇవే

బిల్లును ఈఎంఐ రూపంలోకి మార్చుకున్నందుకు ప్రాజెసింగ్ ఫీజ్, జీఎస్టీతో పాటు ఇతర ఫీజులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఛార్జీలను మీ క్రెడిట్ కార్డు నుంచే బ్యాంకులు తీసుకుంటాయి. ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోతే లేట్ ఫీజులు భారీగా ఉంటాయి. వీటిని గమనించుకుని క్రెడిట్ కార్డ్ బిల్లును ఈఎంఐ రూపంలోకి మార్చుకోవాలి. అవగాహన లేకుండా మార్చుకుంటే మీకే నష్టం జరుగుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్