AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: చిన్న పెట్టుబడితో లక్షలు సంపాదించండి.. మీ ఇంటి నుంచే ఈ బిజినెస్ చేయవచ్చు..

ప్రస్తుతం మార్కెట్‌లో సులువుగా ఉపయోగపడే ఆహార పానీయాలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో మీరు కూడా అలాంటి బిజినెస్ చేయవచ్చు. దీని కోసం మార్కెట్లో తక్కువ ధరకు లభించినప్పుడు కొని.. డిమాండ్ ఉన్నప్పుడు మార్కెట్లోకి తీసుకొస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. అలాంటి బిజినెస్ ఒకటి ఉంది. అదే ఈ చిన్న పెట్టుబడితో ఎక్కువ సంపాధించవచ్చు..

Business Idea: చిన్న పెట్టుబడితో లక్షలు సంపాదించండి.. మీ ఇంటి నుంచే ఈ బిజినెస్ చేయవచ్చు..
Business Ideas
Sanjay Kasula
|

Updated on: Feb 03, 2023 | 8:07 AM

Share

మీరు చిన్న స్థాయిలో ఎక్కువ లాభాలను ఇచ్చే వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే.. ఒక మంచి బిజినెస్ ఐడియాను మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి జనవరి నెల ఉత్తమమైనది. ఈ సమయంలో మీరు పచ్చి బఠానీల వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారంలో మీరు ఖర్చు కంటే చాలా రెట్లు ఎక్కువ లాభం పొందుతారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఫ్రోజెన్  ఫుడ్ పదార్థాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. భారతీయ మార్కెట్ విషయానికి వస్తే, ఆహారం, పానీయాలకు సంబంధించిన చాలా వ్యాపారాలు ఇక్కడ విజయవంతమవుతాయి. మీరు బఠానీల వ్యాపారాన్ని ప్రారంభిస్తే.. అది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మార్కెట్లో తక్కవ ధరకు దొరికినప్పుడు కొని.. ఎక్కవ డిమాండ్ ఉన్నప్పుడు బిజినెస్ చేయాలి. ఈ బఠానీ బిజినెస్ ఎప్పుడు మొదలు పెట్టాలి..? ఏ సమయంలో బఠానీలు తక్కువ ధర ఉంటుంది..? ఏ నెలలో ఎక్కవగా ధర ఉంటుంది..? ఇలాంటి విషయాలను మనం ఇక్కడ తెలుసుకుందాం..

ఫ్రోజెన్ బఠానీల వ్యాపారాన్ని(అంటే ఫ్రిజ్‌లో పెట్టినవి) ఎలా ప్రారంభించాలి అంటే ఘనీభవించిన బఠానీలు ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. దీని కోసం, మీరు తాజా బఠానీలను తీసుకొని చలికాలంలో వాటిని కోల్డ్ స్టోరేజీలో సరిగ్గా నిల్వ చేయాలి. దీనికి జనవరి నెల ఉత్తమమైనది.. ఎందుకంటే ఈ సమయంలో  బఠానీలు ఎక్కువగా మార్కెట్‌లోకి వస్తాయి. చౌక ధరలకు లభిస్తాయి. మీరు పచ్చి బఠానీలను మార్కెట్ నుంచి పెద్దమొత్తంలో కొనుగోలు చేయవచ్చు. మీరు 300 నుంచి 500 చదరపు అడుగుల స్థలంలో మీ ఇంట్లో ఒక భాగంలో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

రాబోయే కాలంలో డిమాండ్ మరింత పెరుగుతుంది. ఈ రోజుల్లో ప్రజలు ఉపయోగించడానికి సులభమైన వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అటువంటి పరిస్థితిలో స్తంభింపచేసిన వస్తువులకు మార్కెట్లో డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. రాబోయే సంవత్సరాల్లో దీని డిమాండ్ మరింత పెరగనుంది. ఫ్రోజెన్ బఠానీలను హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ స్టాల్స్, ఇళ్లలో కూడా విస్తృతంగా ఉపయోగిస్తారు. అటువంటి పరిస్థితిలో మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే.. మీరు బంపర్ సంపాదించవచ్చు.

ఈ వ్యాపారంలో లాభం ఎంత?

ఈ రోజుల్లో పచ్చి బఠానీలు కిలో రూ.20 చొప్పున మార్కెట్‌లో పెద్దమొత్తంలో దొరుకుతున్నాయి. కానీ ఫ్రోజెన్ పచ్చి బఠానీల వ్యాపారం కోసం మీకు చాలా బఠానీలు అవసరం. అందుకే పచ్చి బఠానీలను నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేస్తే కిలో రూ.10-12 చొప్పున సులభంగా లభిస్తాయి. ప్రాసెస్ చేయబడినప్పుడు.. మీరు ఈ బఠానీలను కిలోకు రూ.100-120 చొప్పున పెద్దమొత్తంలో విక్రయించవచ్చు. నేరుగా దుకాణంలో విక్రయిస్తే కిలోకు రూ.200 వరకు ధర లభిస్తుంది. మీరు ఈ వ్యాపారం నుంచి సులభంగా 40-70 శాతం మార్జిన్ పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం