LIC News: పాలసీ పత్రం పోతే ఏం చేయాలి? కొత్తది మళ్లీ ఇస్తారా?.. ఇదిగో ఇలా చేయండి..

ఒకవేళ ఈ పత్రం కనిపించకుండా పోతే? లేదా ఎక్కడైనా ప్రయాణంలో పోగొట్టుకుంటే? లేదా ఏదైనా అగ్ని ప్రమాదాల కారణంగా కోల్పోతే? అప్పుడు ఏం చేయాలి? డూప్లికేట్ డాక్యూమెంట్ ఇస్తారా? అది కావాలంటే ఏం చేయాలి?

LIC News: పాలసీ పత్రం పోతే ఏం చేయాలి? కొత్తది మళ్లీ ఇస్తారా?.. ఇదిగో ఇలా చేయండి..
LIC Scheme
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 12, 2023 | 5:11 PM

ఎల్ఐసీ.. అత్యంత ప్రజాదరణ పొందిన సంస్థ. తన అత్యుత్తమ పథకాలు, సేవలచేత అందరి మన్ననలు పొందింది. వినియోగదారుల నమ్మకాన్ని చూరగొంది. ఎల్ఐసీ నుంచి అతి తక్కువ వడ్డీ రేటుకు రుణాన్ని పొందే చక్కని అవకాశం ఉంది. అయితే ఎల్ఐసీ లో బీమా ప్లాన్ తీసుకున్న వారికి పాలసీ పత్రం ఇస్తారు. దీనిని చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఎందుకంటే క్లెయిమ్ చేయాలన్నా లేదా పాలసీని సరెండర్ చేయాలన్నా పాలసీ డాక్యుమెంట్ కీలకమవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఈ పత్రం లేకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒకవేళ ఈ పత్రం కనిపించకుండా పోతే? లేదా ఎక్కడైనా ప్రయాణంలో పోగొట్టుకుంటే? లేదా ఏదైనా అగ్ని ప్రమాదాల కారణంగా కోల్పోతే? అప్పుడు ఏం చేయాలి? డూప్లికేట్ డాక్యూమెంట్ ఇస్తారా? అది కావాలంటే ఏం చేయాలి? ఆ వివరాలు మీ కోసం..

డూప్లికేట్ ఇస్తారు..

పాలసీ పత్రం కనిపించకుండా పోతే, లేదా ఎక్కడైనా ప్రయాణంలో పోగొట్టుకున్నా.. లేదా అగ్ని ప్రమాదాల కారణంగా నష్టపోయినా డూప్లికేట్ పాలసీ పత్రాన్ని ఎల్ఐసీ నుంచి తీసుకోవచ్చు. అయితే అది చాలా పెద్ద ప్రాసెస్. ఆ విధానం ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం..

ఇవి కూడా చదవండి
  • మీ పాలసీ పత్రం పోగొట్టుకున్నప్పుడు మొదట మీరు చేయాల్సింది.. ఆ విషయాన్ని ఎల్ఐసీకి తెలియజేయాలి. లేదా ఏజెంట్ కైనా చెప్పాలి.
  • ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే.. ఏదైనా వార్తాపత్రికలో ఓ ప్రకటన ఇవ్వాలి. మీరు పాలసీ డాక్యుమెంట్‌ను పోగొట్టుకున్నారని ఆ ప్రకటనలో వివరించాలి. దానిలో మీ పేరు, చిరునామా వంటి మీ వ్యక్తిగత వివరాలను కూడా పొందుపరచాలి. మీ పాలసీ పత్రం పోయిన రాష్ట్రంలోనే ఆ ప్రకటనను ప్రచురించాలి.
  • అనంతరం పాలసీ పత్రాన్ని పోగొట్టుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఆ ఫిర్యాదు రశీదును దగ్గర ఉంచుకోవాలి.
  • ఆ తర్వాత బాండ్ దాఖలు చేయాలి. దీని కోసం, నాన్-జుడీషియల్ స్టాంప్ పేపర్‌పై బీమాదారు, పాలసీదారు సంతకం చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ డాక్యుమెంట్ దుర్వినియోగం కాకుండా ఈ బాండ్లు నిర్ధారిస్తాయి. ఇది బీమా కంపెనీ ప్రయోజనాలను కూడా కాపాడుతుంది.
  • అనంతరం పాలసీ జారీ చేసిన ఎల్ఐసీ శాఖకు వెళ్లి డూప్లికేట్ పాలసీ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆన్ లైన్ లో దరఖాస్తుకు అవకాశం లేదు. దరఖాస్తును పూరించి, పై పత్రాలను బీమా కంపెనీకి అందించాలి.
  • అప్పుడు బీమా కంపెనీ డూప్లికేట్ పాలసీ పత్రాన్ని జారీ చేస్తుంది. అయితే దానిపై డూప్లికేట్ అని స్పష్టంగా ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..