Gold Price: బంగారంపై తగ్గుతున్న ఆసక్తి.. రానున్న కాలంలో జరిగేదిదేనా?

Gold Price Prediction: బంగారం వన్నె కోల్పోతోందా? స్వల్పకాలంలో పెట్టుబడిపరంగా బంగారం నుంచి వచ్చేది ఏమి ఉండదనే విషయాన్ని పెట్టుబడిదారులు గుర్తిస్తున్నారా? గడిచిన ఆరు నెలలుగా రోజుకింత పసిడి ధర తగ్గడం దానికి సంకేతమా? అవును, ఈ కారణంగనానే దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు గత కొంత కాలంగా తగ్గుముఖం పడుతున్నాయి.

Gold Price: బంగారంపై తగ్గుతున్న ఆసక్తి.. రానున్న కాలంలో జరిగేదిదేనా?
Gold price journey
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 01, 2023 | 2:00 PM

Gold Price Prediction: బంగారం వన్నె కోల్పోతోందా? స్వల్పకాలంలో పెట్టుబడిపరంగా బంగారం నుంచి వచ్చేది ఏమి ఉండదనే విషయాన్ని పెట్టుబడిదారులు గుర్తిస్తున్నారా? గడిచిన ఆరు నెలలుగా రోజుకింత పసిడి ధర తగ్గడం దానికి సంకేతమా? అవును, ఈ కారణంగనానే దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు గత కొంత కాలంగా తగ్గుముఖం పడుతున్నాయి. ధరల తగ్గుదల అన్నది భారీగా లేకపోయినప్పటికీ మార్కెట్‌ వర్గాలను ప్రభావితం చేసే స్థాయిలో అది కనిపిస్తోంది. ప్రస్తుతం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,800 ఉంది. 22 క్యారెట్‌ బంగారం ధర రూ. 53,350 గా ఉంది. గోల్డ్‌ మార్కెట్‌లో ధరలు ఇలా ఉంటే ఎంసీఎక్స్ ఫ్యూచర్స్‌లో ఈ ధర రూ. 57,500 లుగా ఉంది. మార్చి 2023 తర్వాత ఇదే అతి తక్కువ ధర అని చెప్పాలి. ద్రవ్యోల్బణ పరిస్థితులు, అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న భౌగోళిక, రాజకీయ అస్థిర పరిస్థి్తుల కారణంగా రానున్న రోజుల్లో బంగారం 10 గ్రాముల ధర రూ. 52 వేల నుంచి 70 వేల మధ్య ఊగిసలాడుతుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అయితే, గడిచిన ఐదేళ్ల కాలంలో బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి సగటుగా 13 శాతం రాబడి వచ్చింది. ఈ కాలంలో చోటుచేసుకున్న అనేక అంతర్జాతీయ పరిణామాలను తట్టుకొని బంగారం నిలిచిందనే చెప్పాలి. ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా బంగారం ఒక సురక్షితమైన పెట్టుబడి సాధనమనే నమ్మకం భారతీయుల్లో గట్టిగా ఉంది. ఈ ఏడాది మొదటి 5 నెలల కాలంలో బంగారం ధరలు 13 శాతం పెరిగాయి. కానీ, ఆ తర్వాత నుంచి దాని ప్రయాణం కొంత కఠినంగా సాగుతోంది.

బంగారు ఆభరణాలు..

భారతదేశ సాంస్కృతిక, సామాజిక రీతుల్లో బంగారం లోతుగా ఒదిగిపోయిందన్నది వాస్తవం. పండగలు, వివాహ వేడుకల్లో బంగారం తప్పనిసరి భాగమైపోయింది. భారతదేశంలో ఆర్థిక సుసంపన్నతను తెలియజెప్పడమే కాదు సాంస్కృతిక ప్రాభావానికి కూడా బంగారం చిహ్నంగా నిలుస్తుంది. అస్థిర సమయాల్లో, మార్కెట్‌ సంక్షోభ సమయంలో స్థిరత్వానికి ప్రతీకగా పసిడి నిలుస్తుందనే నమ్మకం భారతీయ సమాజంలో ఉంది. స్వల్పకాలంలో బంగారం ధరల్లో ఒడిదొడుకులు ఉన్నా దీర్ఘకాలంలో మాత్రం గోల్డ్‌ పాజిటవ్‌గానే కనిపిస్తుంది. దీపావళి, ఆ వెంటనే మొదలయ్యే పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం డిమాండ్‌ భారతదేశంలో అమాంతం 50 శాతం పెరుగుతుంది. ఈ డిమాండ్‌ ఎప్పుటికీ స్థిరంగా ఉంటుంది.

డాలర్ వర్సెస్ రూపాయి..

వాస్తవానికి బంగారం, అమెరికా డాలరుకు మధ్య ప్రతికూల సంబంధం ఉంటుంది. డాలర్‌ బలంగా ఉంటే డాలర్లలో బంగారం ధర క్షీణిస్తుంది. అదే డాలర్‌ బలహీనపడితే బంగారం ధర పెరుగుతుంది. అమెరికా డాలర్‌ బలం, బలహీనతను అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ నిర్ణయించే వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది. వడ్డీ రేట్లు అధికంగా ఉంటే బాండ్లు, పొదుపు ఖాతాల వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాలు ఎక్కువ రాబడి అందిస్తాయి కాబట్టి అవి ఆకర్షణీయంగా నిలుస్తాయి. వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పుడు వడ్డీ రాని బంగారం వంటి ఆస్తులపై రాబడి తగ్గుతుంది, దీంతో బంగారం డిమాండ్‌ క్షీణిస్తుంది. షార్ట్‌ టర్మ్‌ ఇన్వెస్టర్లు ఎక్కువ మంది స్వల్పకాలంలో ఎక్కువ ఆదాయాన్ని అందించే ప్రభుత్వ బాండ్స్‌, కరెన్సీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటారు. యూఎస్‌ డాలర్‌ బలంగా ఉంటే అది అమెరికా ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక మార్కెట్లపై బలమైన నమ్మకాన్ని తెలియజేస్తుంది. ఆ సమయంలో చాలా మంది పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడి సాధనాలకు దూరం జరిగి రిస్క్‌ అయినప్పటికీ స్టాక్స్‌, బాండ్స్‌లో పెట్టుబడులకు మొగ్గుచూపుతారు.

అంతర్జాతీయంగా బంగారం ధరలు..

1964లో బంగారం ధర ఎంతో తెలిస్తే మనం నోరెళ్లబెట్టాల్సిందే. అప్పట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 63.25. 1980లో బంగారం ధర మొదటిసారి వెయ్యి రూపాయలు దాటింది. సంవత్సరం వారీగా లెక్కలు చూస్తే ఏనాడు బంగారం ధర తగ్గిన దాఖలాలు కనిపించవు. 1990 నాటికి బంగారం ధర ఏకంగా రూ. 3,200 దాటింది. 1996లో రూ. 5,160 లకు చేరింది. కానీ, 1997లో రూ. 4,725కు పడిపోయింది. 1998లో ధర మరింత తగ్గి రూ. 4,045కు దిగజారింది. 2001 లో 10 గ్రాముల బంగారం ధర రూ. 4,300 లకు పెరిగింది. 2010 నాటికి ఇది అమాంతరం రూ. 18,500 లకు పెరిగింది. 2015లో 10 గ్రాముల బంగారం ధర 26,343 రూపాయలు. 2020లో దాదాపు రెట్టింపై 48,651 రూపాయలకు చేరింది.

అంతర్జాతీయంగా బంగారం బలంగా ఉండాలంటే డాలర్‌ బలహీనంగా ఉండాలి, దాంతో పాటు బాండ్స్‌పై వచ్చే రాబడి తక్కువుండాలి. ఈ రెండింటి కాంబినేషన్‌ బంగారం ధరను ప్రభావితం చేస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ కాంబినేషన్ కుదరాలంటే ద్రవ్యోల్బణ గణాంకాలు బలహీనంగా ఉండాలి, ఫెడ్‌ అంచనాలు కూడా తిరోగమనంలో ఉండాలి. షార్ట్‌ టర్మ్‌లో బంగారం ధరల్లో ఎదుగుదల ఉండే అవకాశాలు లేవని మార్కెట్‌ను అధ్యయనం చేసే చాలా సంస్థలు ప్రకటించడంతో గడిచిన రెండు నెలలుగా గోల్డ్‌ ఎక్స్‌ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ నుంచి నిధులు బయటకు వెళ్లిపోతున్నాయి. ధరల ఒడిదొడుకులు ఎలా ఉన్నప్పటికీ పెట్టుబడి పోర్టుఫోలియోల్లో బంగారం ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తోంది. చాలా దేశాల రిజర్వ్‌ బ్యాంకులు బంగారాన్ని ప్రాధాన్యత ఆస్తిగానే పరిగణిస్తున్నాయి.

బంగారం ఆధారిత ETFs అంటే ఎక్స్‌ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌తో పాటు అలాంటి ఉత్పత్తుల్లో పెట్టుబడులు ఈ మధ్య కాలంలో తగ్గుతోంది. వీటిల్లో పెట్టుబడులు పెరిగాయంటే బంగారంపై డబ్బు పెట్టుబడిగా పెట్టేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారని అర్థం. కాని ప్రస్తుతం ఆ పరిస్థిత కనిపించడం లేదు. ప్రపంచంలోనే అతి పెద్దదైన SPDR గోల్డ్‌ ట్రస్ట్‌లో ETFలో పెట్టుబడి నాలుగేళ్ల కనిష్ఠానికి పడిపోయాయి. మార్కెట్‌ పరంగా బంగారం భవిష్యత్‌ కొంత నిరాశజనకంగా కనిపిస్తున్నా.. ఫిజికల్‌ గోల్డ్‌కు మాత్రం డిమాండ్‌ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియా, చైనా నుంచి డిమాండ్‌ స్థిరంగా ఉండే సూచనలున్నాయి. ఆర్థిక వ్యవస్థపై ఆందోళన కారణంగా చైనాలో బంగారానికి డిమాండ్‌ పెరుగుతోంది. ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో చైనాలో బంగారు కడ్డీలు, నాణేల డిమాండ్‌ 30 శాతం పెరిగింది. చైనా తర్వాత అత్యధికంగా బంగారం వినియోగించే భారత్‌లో డిమాండ్‌ ఇంకా ఊపందుకోలేదు. పండగ సీజన్‌ త్వరలో మొదలుకానుండటంతో డిమాండ్‌ పుంజుకోవడం ఖాయంగా చెబుతున్నారు నిపుణులు.

మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ