AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Tips: ఈ మంత్రాలు బిజినెస్‌లో సక్సెస్ చేస్తాయి.. వ్యాపారవేత్తలు ఇలా చేస్తే అద్భుతం మీ చేతిలో..

మీ వ్యాపార సామ్రాజ్యానికి మీరే రాజు.. మీరే మంత్రి. మీరు మీ బిజినెస్ ను ఎలా ముందుకు తీసుకెళ్లాలో మీరే నిర్ణయించుకోవచ్చు. మీకు బాస్ అంటూ ఎవరూ ఉండరు. వ్యాపారవేత్తలు వారి స్వంత ఇష్టానికి యజమానులు. వారు తమ వ్యాపారాన్ని వారు కోరుకున్నట్లు నడపవచ్చు. అయితే, ప్రతి ఒక్కరి వ్యాపారం విజయవంతం కాదు. మీరు మీ వ్యాపారాన్ని విజయవంతం చేయాలనుకుంటే.. మీరు కొన్ని చిట్కాలను అనుసరించి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చు. వ్యాపారాన్ని విజయవంతం చేయడానికి ఇక్కడ మేము కొన్ని చిట్కాలను అందించబోతున్నాము.. దీని ద్వారా మీ వ్యాపారంలో వృద్ధిని పొందవచ్చు...

Business Tips: ఈ మంత్రాలు బిజినెస్‌లో సక్సెస్ చేస్తాయి..  వ్యాపారవేత్తలు ఇలా చేస్తే అద్భుతం మీ చేతిలో..
Business Ideas
Sanjay Kasula
|

Updated on: Aug 07, 2023 | 10:24 PM

Share

నేటి కాలంలో డబ్బు సంపాదించడం చాలా ముఖ్యం. డబ్బు సంపాదించడానికి ఉద్యోగం చేయవచ్చు. అయితే, చాలా మంది ఉద్యోగాన్ని ఎంచుకోకుండా.. సొంత వ్యాపారాన్ని కూడా ఎంచుకుంటారు. వారి స్వంత వ్యాపారంలో.. వ్యాపారవేత్తలు వారి స్వంత ఇష్టానికి యజమానులు. వారు తమ వ్యాపారాన్ని వారు కోరుకున్నట్లు నడపవచ్చు. అయితే, ప్రతి ఒక్కరి వ్యాపారం విజయవంతం కాదు. మీరు మీ వ్యాపారాన్ని విజయవంతం చేయాలనుకుంటే.. మీరు కొన్ని చిట్కాలను అనుసరించి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చు. వ్యాపారాన్ని విజయవంతం చేయడానికి ఇక్కడ మేము కొన్ని చిట్కాలను అందించబోతున్నాము.. దీని ద్వారా మీ వ్యాపారంలో వృద్ధిని పొందవచ్చు.

మీరు ఏ ఉత్పత్తిని విక్రయిస్తున్నా లేదా మీరు విక్రయిస్తున్న సేవ ఏదైనా, మీ సేవా వ్యాపారం.. ఉత్పత్తి నాణ్యత బాగుండాలి. మంచి నాణ్యత ఉన్నందున మాత్రమే మార్కెట్‌లో స్థానం సంపాదించవచ్చు. నాణ్యత లేని సేవ, ఉత్పత్తి కూడా వ్యాపారాన్ని మూసివేయవచ్చు.

మీకు కస్టమర్‌లు ఉన్నప్పుడు మాత్రమే..

కస్టమర్లు ఉన్నప్పుడు మాత్రమే వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చు. మీకు ఎక్కువ మంది కస్టమర్లు ఉంటే.. వ్యాపారాన్ని మరింత మెరుగ్గా పెంచుకోవచ్చు. ఈ సందర్భంలో.. ఎల్లప్పుడూ కొత్త కస్టమర్‌లను జోడించండి. అప్పుడే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది.

మార్కెటింగ్

నేటి కాలంలో.. మార్కెట్లు ఏ వ్యాపారం చేయాలన్నా.. మార్కెటింగ్ అనేది చాలా ముఖ్యమం. మార్కెటింగ్ చేయనివాడు, ప్రజలకు తన పనిని చేరుకోలేనివాడు.. అత్యంత వేంగం ఓడిపోతాడు.   మీరు ఈ రేసులో ముందుకు సాగాలంటే.. మార్కెటింగ్ చాలా ముఖ్యం. మీ వ్యాపార పరంగా మీరు చేసే మార్కెటింగ్ రకం, మీరు దీన్ని చేయాలి.

మార్కెటింగ్ లో చాలా కీలకమైనది.. మన వ్యాపారంలో కొత్తదనం చూపించాలి. ఇతరులకంటే తమ వద్ద ఉన్న ప్రోడక్ట్ అద్భుతం అని చెప్పగలగాలి. ఇలా చేస్తే రాబోయే రోజులు మీరు మంచి వ్యాపరం చేసుకోవచ్చు. ఇలా చేస్తే కొత్త కస్టమర్లు మీకు వస్తారు. వారితో మీ వ్యాపారాన్ని పెంచుకోవచ్చు.

మీ వద్దకు వచ్చే కస్టమర్లతో మంచిగా, మృదువుగా మాట్లాడండి. వారికి అవసరమైన వస్తువులు, దానితో మారికి కలిచే సౌకర్యం గురించి వివరించండి. తప్పకా మీరు చూపించిన వస్తువును కొంటారు.

బిజినెస్ ఐడియా

ఈ రోజుల్లో మార్కెట్‌లో అన్ని రకాల వ్యాపారాల జోరు ఉంది. ప్రతి ఒక్కరు ఓ పనిలో బిజిగా ఉన్నారు. అటువంటి సమయంలో మీకు ఏదైనా ప్రత్యేకమైన ఆలోచన ఉంటే దానికి వ్యాపార రూపం ఇవ్వండి. ఆ ఐడియాను కార్యరూపం ఇస్తే మార్కెట్లో త్వరగా పుంజుకుంటుంది.  మీ వ్యాపార ఆలోచన చాలా మంది వ్యక్తుల సమస్యలకు పరిష్కారంగా మారుతుందని గుర్తుంచుకోండి.