Personal Finance: విదేశాలకు వెళితే డెబిట్, క్రెడిట్ కార్డులలో దేనిని ఉపయోగిస్తే లాభం?

తరచుగా విదేశాలకు వెళ్లే వ్యక్తుల అధిక ఖర్చును తగ్గించడానికి డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ను ఉపయోగించాలా అని అనుమానపడతారు. అధికంగా ఖర్చు చేయకుండా ఉండేందుకు డెబిట్ కార్డ్ ని ఉపయోగించడం సరైనదా..? లేక క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించాలా? Tax Collected at Source (TCS)ను నివారించడంలో క్రెడిట్ కార్డ్ సహాయపడుతుంది. మీరు విదేశాలలో డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ని ఉపయోగించినప్పుడు..

Personal Finance: విదేశాలకు వెళితే డెబిట్, క్రెడిట్ కార్డులలో దేనిని ఉపయోగిస్తే లాభం?
Debit Card, Credit Card
Follow us
Subhash Goud

|

Updated on: Dec 28, 2023 | 11:19 AM

మీరు మీ కుటుంబంతో కలిసి సింగపూర్ వెళ్తున్నారు. మీరు కొంచెం అయోమయంలో పడ్డారు. ట్రిప్ సమయంలో డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ఉపయోగించాలా అనేది గందరగోళంగా ఉంది. విదేశీ పర్యటనకు ప్లాన్ చేసుకోవడం అంత తేలికైన పని కాదు. టిక్కెట్ల బుకింగ్, సందర్శించాల్సిన ప్రదేశాలు, ఏ హోటల్‌లో బస చేయాలి..? ఇలా అన్ని విషయాలు ముందుగానే నిర్ణయించుకోవాలి. అప్పుడు మరొక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.. అది ఖర్చులకు సంబంధించినది.

తరచుగా విదేశాలకు వెళ్లే వ్యక్తుల అధిక ఖర్చును తగ్గించడానికి డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ను ఉపయోగించాలా అని అనుమానపడతారు. అధికంగా ఖర్చు చేయకుండా ఉండేందుకు డెబిట్ కార్డ్ ని ఉపయోగించడం సరైనదా..? లేక క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించాలా? Tax Collected at Source (TCS)ను నివారించడంలో క్రెడిట్ కార్డ్ సహాయపడుతుంది. మీరు విదేశాలలో డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ని ఉపయోగించినప్పుడు మీకు ఎలాంటి ఛార్జీలు విధిస్తారు అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది.

ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు మీ మదిలో మెదులుతాయి. గుర్తుంచుకోవలసిన మొదటి విషయం ఏమిటంటే, డెబిట్ కార్డ్ తో ఖర్చు చేయడం అంటే మీ బ్యాంక్ ఖాతా నుండి డబ్బు వెంటనే డెబిట్ అవుతుంది. మీరు విదేశాల్లో చేసే ఖర్చులకు చెక్ పెట్టాలనుకుంటే, డెబిట్ కార్డ్ సరైన ఎంపిక. మరోవైపు, మీ అంతర్జాతీయ ప్రయాణాల సమయంలో మీ చేతిలో తక్కువ నగదు లేదా మీ ఖాతాలో నిధులు తక్కువగా ఉన్నప్పుడు క్రెడిట్ కార్డ్ చాలా సహాయపడుతుంది. దీనితో పాటు క్రెడిట్ కార్డ్..45 నుండి 50 రోజుల వడ్డీ రహిత వ్యవధిని అందిస్తుంది. దీని వలన మీరు బిల్లును తర్వాత చెల్లించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు, వివిధ రకాల ఛార్జీల గురించి మాట్లాడుకుందాం. విదేశాల్లో చేసే ప్రతి ఖర్చుపైనా డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు రెండింటికీ మార్కప్ ఫీజ్ ఉంటుంది. ఇది సాధారణంగా లావాదేవీ విలువలో 1%. అంటే 1,000 రూపాయల లావాదేవీకి 10 రూపాయల మార్కప్ రుసుమును చెల్లించాలి. భారతదేశం బయట, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చెల్లింపులు ఎక్కువగా విదేశీ కరెన్సీలో జరుగుతాయి. కార్డ్ ద్వారా చేసిన లావాదేవీల విలువ ఆ దేశ కరెన్సీగా మారుతుంది. ప్రతీ లావాదేవీకి, ఫారెక్స్ ఎక్స్ఛేంజ్ రుసుము వర్తిస్తుంది. ఇది సాధారణంగా 3.5% వరకు ఉంటుంది. మీరు ATMల నుండి నగదు ఉపసంహరణ కోసం విదేశాలలో క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే, మీకు వడ్డీ ఛార్జీలు మాత్రమే కాకుండా విదేశీ కరెన్సీ లావాదేవీల రుసుములు, ఉపసంహరణ రుసుములు లేదా నగదు అడ్వాన్స్ ఫీజులు కూడా ఉంటాయి. 3.5% వరకు నగదు అడ్వాన్స్ రుసుము, రివాల్వింగ్ క్రెడిట్‌పై 42% వార్షిక వడ్డీ ఛార్జీ లేదా 3.5% వరకు నెలవారీ వడ్డీ ఛార్జీ.. విదేశాల్లో ఖర్చు చేసిన మొత్తానికి పడుతుంది

అదేవిధంగా, డెబిట్ కార్డ్ ద్వారా ATMల నుండి డబ్బు విత్‌డ్రా చేస్తే ఫ్లాట్ విత్‌డ్రా ఫీజు పడుతుంది. ఇది సాధారణంగా క్రెడిట్ కార్డ్‌లపై వసూలు చేసే నగదు ఉపసంహరణ రుసుము కంటే చాలా తక్కువ. ప్రతి లావాదేవీపై సాధారణంగా 125 నుండి 150 రూపాయల ఫ్లాట్ ఉపసంహరణ ఫీజును విధిస్తారు.

అందువల్ల, మీకు వెంటనే నగదు అవసరమైతే ఫీజులు ఎలా ఉంటాయో అర్థమైంది కదా. మీ బ్యాంక్ ఖాతాలో నిధులు ఉంటే, మీరు ATMల నుండి ఉపసంహరణ కోసం డెబిట్ కార్డ్‌ని ఉపయోగించాలి. నగదు ఉపసంహరణ కోసం క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం మానుకుంటేనే మంచిది. TCS పరంగా, అక్టోబర్ 2023 నుండి కొత్త నియమం అమల్లోకి వచ్చింది. వ్యక్తిగతంగా ఎవరైనా ఒక ఆర్థిక సంవత్సరంలో 7 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే TCS చెల్లించాలి. ఒకే ఆర్థిక సంవత్సరంలో డెబిట్ కార్డ్‌ని ఉపయోగించి 7 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తే మాత్రం TCS ను విధించరు. దీంతోపాటు అంతర్జాతీయ క్రెడిట్ కార్డులపై TCS లేదు. ఇది లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS)కు వెలుపల ఉంటుంది. విదేశాల్లో ఖర్చు చేస్తున్నప్పుడు, మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌కు అదనపు ఛార్జీలను లెక్కించి, చెక్ చేయండి. ఆ తర్వాత మాత్రమే, మీరు ఏ కార్డ్‌ని ఉపయోగించాలో నిర్ణయించుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి