Personal Finance Survey: భారతీయులు తమ పొదుపు మొత్తాలను ఎందుకు వాడుకుంటున్నారు?

తమ పొదుపును వాడుకున్నవారిలో 67 శాతం మంది,తమకు వైద్య ఖర్చులే అతిపెద్ద భారమని వెల్లడించారు. దాదాపు 22.3 శాతం మంది ప్రజలు చికిత్స ఖర్చుల కోసం తమ పొదుపు మొత్తాన్ని వెనక్కు తీసుకోక తప్పలేదు. అదే సమయంలో 15.2 శాతం మంది ప్రజలు ఉద్యోగం కోల్పోవడం లేదా సంపాదన ఆగిపోవడం వల్ల తమ పొదుపు మొత్తాన్నితీసేసుకున్నారు. ఇది కాకుండా, పెరుగుతున్న విద్యా వ్యయం కూడా ప్రజలు తమ ..

Personal Finance Survey: భారతీయులు తమ పొదుపు మొత్తాలను ఎందుకు వాడుకుంటున్నారు?
Personal Finance Survey
Follow us

|

Updated on: Dec 28, 2023 | 10:37 AM

భారత కుటుంబాలకు ద్రవ్యోల్బణం సెగ తగులుతోంది. ఆహార పదార్థాలపై ఖర్చు తడిసి మోపెడవుతోంది. అదే సమయంలో కోవిడ్ వల్ల కుటుంబాల ఆదాయానికి పెద్ద దెబ్బ తగిలింది. ఇది భారతీయ కుటుంబాల పొదుపుపై కూడా ప్రభావం చూపుతోంది. అవసరమైన ఖర్చుల కోసం కుటుంబాలు తమ పొదుపు మొత్తాన్ని వాడేస్తున్నాయి. ఇండియాస్ పల్స్ పర్సనల్ ఫైనాన్స్ సర్వే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇచ్చింది. ఈ గణాంకాలు నిజంగా ప్రభుత్వాలకు, విధాన రూపకర్తలకు కళ్లు తెరిపించేలా ఉన్నాయని చెప్పాలి. సర్వే ప్రకారం, 67 శాతం కుటుంబాలు గత 5 సంవత్సరాలలో తమ పొదుపు మొత్తాలను ఎన్‌క్యాష్ చేయాల్సి వచ్చింది. 33 శాతం కుటుంబాలు తమ ప్రస్తుత సంపాదనతో ఖర్చులను సర్దుబాటు చేసుకున్నాయి. గత ఐదేళ్లలో కుటుంబాలు కోవిడ్ వంటి మహమ్మారిని ఎదుర్కొన్నాయి. వేతనాల కోత, ఉద్యోగాల కోత వల్ల కుటుంబాల ఆదాయం తగ్గింది. పైగా వైద్య ఖర్చులు భారీగా పెరిగాయి.

పొదుపు మొత్తాలను ఎందుకు వాడుకున్నారు?

మనీ9 సర్వేలో తమ పొదుపును వాడుకున్నవారిలో 67 శాతం మంది,తమకు వైద్య ఖర్చులే అతిపెద్ద భారమని వెల్లడించారు. దాదాపు 22.3 శాతం మంది ప్రజలు చికిత్స ఖర్చుల కోసం తమ పొదుపు మొత్తాన్ని వెనక్కు తీసుకోక తప్పలేదు. అదే సమయంలో 15.2 శాతం మంది ప్రజలు ఉద్యోగం కోల్పోవడం లేదా సంపాదన ఆగిపోవడం వల్ల తమ పొదుపు మొత్తాన్నితీసేసుకున్నారు. ఇది కాకుండా, పెరుగుతున్న విద్యా వ్యయం కూడా ప్రజలు తమ పొదుపు మొత్తాలను వినియోగించేలా చేసింది. దాదాపు 11 శాతం కుటుంబాలు విద్యా ఖర్చుల కోసమే తమ సేవింగ్స్ ను ఉపయోగించుకోవాల్సి వచ్చింది. ఇది కాకుండా, పొదుపు మొత్తాన్ని వాడుకోవడానికి.. సేవింగ్స్ ను తగ్గించుకోవడానికి వివాహం కూడా ఒక కారణంగా మారింది. గత 5 సంవత్సరాలలో 8.2 శాతం భారతీయ కుటుంబాలు పెళ్లి ఖర్చుల కోసం తమ సేవింగ్స్ మొత్తాన్నితగ్గించుకున్నాయి. దాదాపు అదే సంఖ్యలో కుటుంబాలు, అంటే 8.2 శాతం మంది, రుణాలను తిరిగి చెల్లించేందుకు తమ పొదుపును ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. కరోనా సంక్షోభంలో, చాలా కుటుంబాలకు సంపాదించే సభ్యుడి అండ లేకుండా పోయింది. సంపాదిస్తున్న కుటుంబ సభ్యుల మరణం వల్ల 2.3 శాతం కుటుంబాలు.. తమ పొదుపును కోల్పోయాయి.

ఇవి కూడా చదవండి

సర్వే ప్రకారం, 24 శాతం మంది ఉద్యోగులు తమ ఉద్యోగం పోతుందనే భయంతో ఉంటారు, ఇది కాకుండా, 56 శాతం మంది ప్రజలు తమ ఉద్యోగాన్ని కోల్పోతారనే భయంతో ఉన్నారు. అంటే దేశంలోని 80 శాతం మంది ప్రజలు తమ ఉద్యోగాలు పోతాయన్న భయంతోనే బతుకుతున్నారు. కేవలం 20 శాతం మంది మాత్రమే తమ ఉద్యోగాలు పోతాయన్న భయం లేనివారు ఉన్నారు.

56% కుటుంబాలకు కేవలం 2 నెలల పొదుపు 

సర్వే ప్రకారం చూస్తే… ఉద్యోగం పోతుందనే భయంతో ఉన్న 24 శాతం మంది… తమ వద్ద తగినంత పొదుపు ఉందని, ఉద్యోగం కోల్పోతే ఆ మొత్తంతో 6 నెలలు జీవించవచ్చని చెప్పారు, అదేవిధంగా 56 శాతం మంది ప్రజలు.. అంటే ఉద్యోగం పోతుందన్న భయం పెద్దగా లేనివారు.. తాము జాబ్ కోల్పోయినా తమ దగ్గరున్న మొత్తంతో 2-3 నెలలు జీవించగలమని చెప్పారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి