T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్ సిరీస్‌లో భాగంగా ఈ నెల 24వ తేదీన భారత్ vs పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ను పురస్కరించుకుని కస్టమర్లు, వినియోగదారుల కోసం ప్రముఖ డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్ అయిన పేటీఎం బంపర్ ఆఫర్ ప్రకటించింది. అక్టోబర్ 24వ తేదీన చేసే అన్ని డీటీహెచ్ రీఛార్జ్‌లపై 10 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. 10 శాతం అంటే వినియోగదారులు అప్ టూ రూ. 40 వరకు క్యాష్ పొందే అవకాశం ఉంది. అన్ని రకాల డీటీహెచ్ సర్వీసులకు ఇది వర్తిస్తుందని పేటీఎం ప్రకటించింది. అయితే, ఆ ఆఫర్‌ను పొందాలంటే వినియోగదారులు ఒక పని చేయాల్సి ఉంది. అదేంటంటే.. వినియోగదారులు డీటీహెచ్ రీచార్జ్ కోసం పేటీఎం ద్వారా పేమెంట్ చేసే ముందు.. “Inda vs Pak” ప్రోమో కోడ్‌ని అప్లయ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌కి అదనంగా ఇప్పటికే ఉన్న వినియోగదారులు అన్ని ప్రముఖ డిటిహెచ్ ఆపరేటర్ల రీఛార్జ్‌పై రూ. 500 వరకు ఖచ్చితమైన రివార్డ్‌లను పొందవచ్చు: టాటా స్కై, ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ, డిష్ టీవీ, డి2హెచ్, సన్ డైరెక్ట్. ఈ ఆఫర్లు మ్యాచ్ ఉన్న అన్నీ రోజులలో అన్ని సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లకు వర్తిస్తాయి.
భారత దేశ వ్యాప్తంగా ఉన్న పేటీఎం వినియోగదారుల కోసం తొలిసారి ఈ ఆఫర్‌ను తీసుకువచ్చామని పేటీఎం ప్రతినిధి తెలిపారు. కస్టమర్లకు ఎలాంటి అవాంతరాలు లేని సర్వీస్‌ను అందించడమే తమ ప్రధాన లక్ష్యం అని చెప్పుకొచ్చారు. క్రికెట్‌లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటు అదో రకమైన క్రేజ్ ఉంటుంది. అభిమానులు ఈ మ్యాచ్‌ను ఆస్వాధిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే కొత్త క్యాష్ బ్యాక్ ఆఫర్‌తో తమ వినియోగదారుల్లో ఉత్సాహాన్ని నింపాలని నిర్ణయించుకున్నామని అన్నారు. కాగా, వినియోగదారులు పేటీఎం ద్వారా విద్యుత్ బిల్లులు, మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ & డిటిహెచ్ రీఛార్జ్‌లు, రెంట్ చెల్లింపులు, క్రెడిట్ కార్డ్ బిల్లులు తదితర పేమెంట్స్ చెల్లించేందుకు అవకాశం ఉంది.
Also read:
Beauty Tips: అందంగా ఉండటం కోసం ఇలా చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. తేడా వస్తే అందానికే ప్రమాదం..!
TS EAMCET 2021: తెలంగాణ ఎంసెట్ తుది విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తివివరాలివే..
Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..