Indian Railways: రైళ్లలో రాత్రి 10 దాటిన తర్వాత ఈ పొరపాట్లు చేస్తున్నారా? జాగ్రత్త.. నిబంధనలు తెలుసుకోండి

సమీపంలో లేదా దూరంగా ఉన్నా, భారతీయ రైల్వేలు భారతీయ ప్రయాణానికి ప్రధానమైనవి. భారతీయ రైల్వేలు ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటి. ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులు లోకల్, సుదూర రైళ్లలో ప్రయాణిస్తున్నారు. భారతీయ రైల్వే గత కొన్నేళ్లుగా ప్రయాణికుల సేవలపై దృష్టి సారిస్తోంది. ఈసారి రైల్వే ప్రయాణికుల కోసం రైల్వే పలు నిబంధనలను మార్చింది. ప్రయాణికుల నుంచి టీటీఈ వరకు..

Indian Railways: రైళ్లలో రాత్రి 10 దాటిన తర్వాత ఈ పొరపాట్లు చేస్తున్నారా? జాగ్రత్త.. నిబంధనలు తెలుసుకోండి
Indian Railways
Follow us
Subhash Goud

|

Updated on: Dec 09, 2023 | 6:38 PM

సమీపంలో లేదా దూరంగా ఉన్నా, భారతీయ రైల్వేలు భారతీయ ప్రయాణానికి ప్రధానమైనవి. భారతీయ రైల్వేలు ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటి. ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులు లోకల్, సుదూర రైళ్లలో ప్రయాణిస్తున్నారు. భారతీయ రైల్వే గత కొన్నేళ్లుగా ప్రయాణికుల సేవలపై దృష్టి సారిస్తోంది. ఈసారి రైల్వే ప్రయాణికుల కోసం రైల్వే పలు నిబంధనలను మార్చింది. ప్రయాణికుల నుంచి టీటీఈ వరకు అందరూ ఈ నిబంధనను పాటించాల్సిందే. ముఖ్యంగా సుదూర రైళ్లలో రాత్రిపూట ప్రయాణించేటప్పుడు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రైల్వే శాఖ మరోసారి గుర్తు చేసింది. నిబంధనలు పాటించకుండా పొరపాట్లు చేస్తే జరిమానా తప్పదని రైల్వే శాఖ హెచ్చరిస్తోంది. మరి ఆ నియమాలు ఏమిటో తెలుసుకుందాం.

  • రైల్వే శాఖ ప్రకారం.. రాత్రి 10 గంటల తర్వాత, రైలులో ప్రయాణికులు పెద్దగా మాట్లాడేందుకు వీలు లేదు.
  • రాత్రి 10 గంటల తర్వాత మొబైల్‌లలో గానీ ఇతర స్పీకర్స్‌లో సాంగ్స్‌, ఇతర మ్యూజిక్‌లాంటివి పెట్టకూడదు.
  • రాత్రి 10 గంటల తర్వాత పెద్ద లైట్లు వేయరాదు. రాత్రి చిన్నపాటి లైట్‌ మాత్రమే ఉపయోగించుకోవాలి.
  • క్యాటరింగ్ కంపెనీ రాత్రి 10 గంటల తర్వాత రైల్లోని ప్రయాణికులకు ఎలాంటి ఆహారం అందించేందుకు రాకూడదు. దీని వల్ల వారికి ప్రయాణికులకు ఇబ్బందిగా మారవచ్చు.
  • సుదూర రైళ్లలో రాత్రి 10 గంటలలోపు టీటీఈలు రైలు టిక్కెట్లను తనిఖీ చేయాలి. అర్ధరాత్రి ప్రయాణికులు రైలు ఎక్కితే కొద్దిసేపటికే ఆ బెర్త్ వద్దకు టీటీఈ వచ్చి టికెట్ చెక్ చేసుకోవాలి.
  • విమానాల మాదిరిగానే, రైళ్లు నిర్దిష్ట బరువు వరకు లగేజీని మోయగలవు.
  • ఏసీ గదుల కోసం ప్రయాణికులు గరిష్టంగా 70 కిలోల వరకు బ్యాగేజీని తీసుకెళ్లవచ్చు.
  • నాన్ ఏసీ స్లీపర్ క్లాస్ గరిష్టంగా 40 కిలోల బరువును తీసుకెళ్లవచ్చు.
  • సెకండ్ క్లాస్ ప్రయాణికులు 35 కిలోల వరకు వస్తువులను తీసుకెళ్లవచ్చు. వస్తువులు అధిక బరువుతో ఉంటే జరిమానా విధిస్తుంది రైల్వే.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో