జనవరి 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1 ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మోడీ ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న (మధ్యంతర బడ్జెట్) ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ సమర్పణకు ఒకరోజు ముందు అంటే జనవరి 31న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మరుసటి రోజు ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
ఇండియా టుడేలో వచ్చిన కథనం ప్రకారం ఈ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 9 వరకు జరగనున్నాయి. జనవరి 31 నుంచి 11 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ బడ్జెట్ లో పెద్దగా ప్రకటనలు లేకపోయినా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఏప్రిల్, మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున అంతకు ముందు వచ్చే బడ్జెట్ మధ్యంతర బడ్జెట్. ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చి జూలైలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు, ప్రభుత్వం అవసరమైన వ్యయాన్ని ఆమోదించడానికి, ఆర్థిక వ్యవస్థకు నిధుల కేటాయింపును సజావుగా చేయడానికి మధ్యంతర బడ్జెట్, ఓటు ఆన్ అకౌంట్ ఉంటుంది. ప్రస్తుత బడ్జెట్‌పై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. ఆదాయపు పన్నుకు సంబంధించిన అంశాలపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవాకశం ఉంటుందని చెబుతున్నారు. అలాగే బ్యాంకు హోమ్ లోన్స్‌పై కూడా పన్ను రాయితీని పెంచాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని ఎదురు చూస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి