శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) అనేది ఇప్పుడు అన్ని అవసరాలకు తప్పనిసరైంది. ముఖ్యంగా పన్ను ప్రయోజనాలను పొందడంతో పాటు బ్యాంకింగ్ అవసరాల కోసం పాన్‌కార్డు ముఖ్యమైన ధ్రువీకరణ పత్రంగా మారింది. పాన్ కార్డు అంటే వ్యక్తులు, సంస్థలకు ఆదాయపు పన్ను శాఖ ద్వారా జారీ చేసే పది అంకెల ఆల్ఫాన్యూమరిక్ నంబర్. ఇది ప్రతి పన్ను చెల్లింపుదారులకు ఒక ప్రత్యేక గుర్తింపుగా ఉంటుంది. అలాగే వారి ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేయడానికి ఉపయోగిస్తారు. అయితే పాన్ కార్డుకు అప్లయ్ చేశాక ప్రింటింగ్, పోస్టేజీ, మాన్యువల్ హ్యాండ్లింగ్ కారణంగా భౌతిక పాన్‌కార్డు పొందే సంప్రదాయ ప్రక్రియకు కొంత సమయం పట్టవచ్చు. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ-పాన్‌లు ఎలక్ట్రానిక్‌గా జనరేట్ అవుతాయి. ముఖ్యంగా జారీ సమయం గణనీయంగా తగ్గి కేవలం పది నిమిషాల్లోనే పాన్ నెంబర్ పొందవచ్చు.
ఈ-పాన్ సదుపాయం ఆధార్ నంబర్‌ను కలిగి ఉన్న దరఖాస్తుదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. తక్షణ పాన్ కేటాయించడం ఈ-పాన్ ప్రధాన విధుల్లో ఒకటి. పాన్ దరఖాస్తుదారులకు పీడీఎఫ్ రూపంలో జారీ చేస్తారు. ఈ సర్వీసు పూర్తిగా ఇది ఉచితం. ఈ-పాన్ అనేది ఆధార్ ఈ-కేవైసీ డేటా ఆధారంగా ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో డిజిటల్ సంతకంతో జారీ చేసే పాన్‌కార్డు. తక్షణ ఈ-పాన్ సేవ వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులందరికీ అందుబాటులో ఉంది.
అప్లికేషన్‌ను విజయవంతంగా సమర్పించాక రసీదు సంఖ్యతో పాటు విజయవంతమైన సందేశం ప్రదర్శిస్తారు. భవిష్యత్ సూచన కోసం అక్నాలెడ్జ్‌మెంట్ ఐడీని నోట్ చేసుకోండి. ఆధార్‌తో లింక్ చేసిన మీ మొబైల్ నంబర్‌కు మీరు నిర్ధారణ సందేశాన్ని కూడా అందుకుంటారు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం