Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAN Apply: పాన్‌కార్డు పొందాలంటే ఎలాంటి పత్రాలు అవసరం.. ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి..?

PAN Apply: బ్యాంకింగ్‌కు సంబంధించిన ఏ పనికైనా పాన్ కార్డ్ అవసరం . ఖాతా తెరవడానికి వెళ్లినా పాన్ కార్డు వివరాలు అడుగుతారు. ఇది కాకుండా, ఆదాయపు పన్ను రిటర్న్‌లను..

PAN Apply: పాన్‌కార్డు పొందాలంటే ఎలాంటి పత్రాలు అవసరం.. ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి..?
Follow us
Subhash Goud

|

Updated on: Aug 08, 2022 | 5:00 AM

PAN Apply: బ్యాంకింగ్‌కు సంబంధించిన ఏ పనికైనా పాన్ కార్డ్ అవసరం . ఖాతా తెరవడానికి వెళ్లినా పాన్ కార్డు వివరాలు అడుగుతారు. ఇది కాకుండా, ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడం లేదా స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయడం లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వంటి అనేక ఇతర పనులకు పాన్‌ కార్డు తప్పనిసరి కావాల్సిందే. అందువల్ల మీకు ఇప్పటికే పాన్ లేకపోతే దరఖాస్తు చేసుకోండి. పాన్ కార్డు పొందడానికి ఎలాంటి పత్రాలు అవసరమో తెలుసుకోండి.

ఆదాయపు పన్ను శాఖ ప్రకారం.. ఇప్పటికే ఉన్న అన్ని ఏజెన్సీలు లేదా పన్ను చెల్లింపుదారులు లేదా ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయాల్సిన వ్యక్తులు, ఎవరైనా మీ రిటర్న్‌ను ఫైల్ చేయాలంటే పాన్‌కార్డు తప్పనిసి కావాల్సిందే. పాన్‌ లేకుంటే లావాదేవీకి సంబంధించిన పనులు నిలిచిపోతాయి. పాన్‌కార్డును ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లోనూ పొందవచ్చు. ఇందులో ఆన్‌లైన్ పద్ధతి చాలా సులభం. మీరు ఇంట్లో కూర్చొని ఈ పనిని చేయవచ్చు. ఇలా పాన్‌ కార్డు పొందాలంటే ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు.

ఆన్‌లైన్ దరఖాస్తును ఎలా చేయాలి

ఇవి కూడా చదవండి

☛ మీరు ముందుగా వెబ్‌సైట్‌ లింక్‌పై క్లిక్‌ చేయండి.

☛ ఇక్కడ ఆన్‌లైన్ ఫారమ్ ఓపెన్‌ అవుతుంది. అందులో అడిగే వివరాలను పూరించాలి. ఫారమ్‌ను సమర్పించడానికి చెల్లింపు మోడ్‌ను ఎంచుకోండి.

☛ ఆన్‌లైన్‌లో విజయవంతంగా దరఖాస్తు చేసి చెల్లింపు చేసిన తర్వాత మీరు రసీదుని సేవ్‌ చేసుకుని ప్రింటి తీసుకోవాలి.

☛ ఫారమ్ నింపిన తర్వాత, దాని నుండి ప్రింట్ అవుట్ తీసుకొని సంతకం చేయండి. ఒక ఫోటోను కూడా అతికించండి.

☛ అవసరమైన అన్ని పత్రాలతో పాటు ఈ ఫారమ్‌ను జత చేసి, NSDL చిరునామాకు పోస్ట్ చేయాలి. లేదా కొరియర్ ద్వారా కూడా పంపవచ్చు.

 ఏయే పత్రాలు అవసరం:

☛ ఓటరు గుర్తింపు కార్డు

☛ పాస్ ఫోటో సైజ్ ఫోటో

☛ దరఖాస్తుదారు ఫోటోతో రేషన్ కార్డు

☛ డ్రైవింగ్‌ లైసెన్స్‌

☛ ఆధార్ కార్డు

☛ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు

☛ దరఖాస్తుదారు ఫోటోతో కూడిన పెన్షనర్ కార్డ్ కాపీ

☛ దరఖాస్తుదారు ఫోటో, బ్యాంక్ ఖాతా నంబర్‌తో కూడిన సర్టిఫికేట్

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

కెప్టెన్‌కి బహుమతిగా గోల్డ్ ఐఫోన్.. ఎత్తుకెళ్లిన తోటి ప్లేయర్
కెప్టెన్‌కి బహుమతిగా గోల్డ్ ఐఫోన్.. ఎత్తుకెళ్లిన తోటి ప్లేయర్
ఐదేళ్ళ తర్వాత కైలాస మానస సరోవర యాత్ర ప్రారంభం.. ఎప్పటి నుంచి అంటే
ఐదేళ్ళ తర్వాత కైలాస మానస సరోవర యాత్ర ప్రారంభం.. ఎప్పటి నుంచి అంటే
మీరు ఇష్టంగా తినే ఈ కూరగాయలే మిమ్మల్ని ఇబ్బంది పెడుతాయి జాగ్రత్త
మీరు ఇష్టంగా తినే ఈ కూరగాయలే మిమ్మల్ని ఇబ్బంది పెడుతాయి జాగ్రత్త
గోధుమలను ఇలా తెలివిగా నిల్వ చేస్తే మీ డబ్బులు కూడా ఆదా అయినట్టే
గోధుమలను ఇలా తెలివిగా నిల్వ చేస్తే మీ డబ్బులు కూడా ఆదా అయినట్టే
ఉదయం లేవగానే ఉత్సాహంగా ఉండాలంటే రాత్రికి తినడం తగ్గించాల్సిందే
ఉదయం లేవగానే ఉత్సాహంగా ఉండాలంటే రాత్రికి తినడం తగ్గించాల్సిందే
మళ్లీ గాయపడ్డ సిక్స్ హిట్టర్.. రాజస్థాన్ ఆశలు ఆవిరేనా?
మళ్లీ గాయపడ్డ సిక్స్ హిట్టర్.. రాజస్థాన్ ఆశలు ఆవిరేనా?
వచ్చే జన్మలో ప్రభాస్‌లాంటి కొడుకుకావాలి..
వచ్చే జన్మలో ప్రభాస్‌లాంటి కొడుకుకావాలి..
కుండని ఎన్ని రోజులకు శుభ్రం చేయాలి? ఎలా శుభ్రం చేయాలంటే
కుండని ఎన్ని రోజులకు శుభ్రం చేయాలి? ఎలా శుభ్రం చేయాలంటే
వీడు బ్రాండెడ్ దొంగ.. వీడి బ్రాండ్ ఏమిటంటే? వీడియో
వీడు బ్రాండెడ్ దొంగ.. వీడి బ్రాండ్ ఏమిటంటే? వీడియో
అల్లుడితో వెళ్లిపోయిన అత్త.. తిరిగి వచ్చింది కానీ వీడియో
అల్లుడితో వెళ్లిపోయిన అత్త.. తిరిగి వచ్చింది కానీ వీడియో