Zero Balance Accounts: జీరో ఖాతా తెరిస్తే ఇన్ని లాభాలా? జీరో అకౌంట్ ఇచ్చే బ్యాంకులివే
కనీస బ్యాలెన్స్ అవసరం లేని ఈ ఖాతాలు భారతదేశంలోని పేదలకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇది ఓ ప్రాథమిక పొదుపు ఖాతా. సాధారణ బ్యాంక్ అకౌంట్ల లాగనే వీటికి కూడా అన్ని సదుపాయాలు ఉంటాయి. అయితే డిపాజిట్, విత్ డ్రా విషయంలోనే కొన్ని పరిమితులు ఉంటాయి.

భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తుంది. ముఖ్యంగా ప్రపంచ దేశాలతో పోటీపడాలంటే ప్రాథమిక బ్యాంకింగ్ సేవలు ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. ఈ నేపథ్యంలో అందరికీ బ్యాంకింగ్ సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సుమారు పదేళ్ల నుంచి జన్‌ధన్ ఖాతాలను ప్రజలకు అందిస్తుంది. వీటినే వాడుక భాషలో జీరో అకౌంట్లని అని అంటారు. కనీస బ్యాలెన్స్ అవసరం లేని ఈ ఖాతాలు భారతదేశంలోని పేదలకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇది ఓ ప్రాథమిక పొదుపు ఖాతా. సాధారణ బ్యాంక్ అకౌంట్ల లాగానే వీటికి కూడా అన్ని సదుపాయాలు ఉంటాయి. అయితే డిపాజిట్, విత్ డ్రా విషయంలోనే కొన్ని పరిమితులు ఉంటాయి. అయితే సాధారణ పేద ప్రజలకు ఈ పరిమితుల వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే క్రమేపి జన్‌దన్ ఖాతాలతో సంబంధం లేకుండా ప్రముఖ బ్యాంకింగ్ సంస్థలు కూడా జీరో బ్యాలెన్స్‌తో మెయిన్‌టెయిన్ చేసే ప్రత్యేక ఖాతాలను అందిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం ఏయే బ్యాంకులు జీరో బ్యాలెన్స్ ఖాతాలు అందిస్తున్నాయి? ఆ ఖాతాలను పొందడం వల్ల కలిగే వచ్చే ప్రయోజనాలు ఏంటో? ఓ సారి తెలుసుకుందాం.
హెచ్‌డీఎఫ్‌సీ
ప్రైవేట్ రంగ సంస్థ అయిన హెచ్‌డీఎఫ్‌సీ కూడా జీరో బ్యాంకు ఖాతాను అందిస్తుంది. ఈ ఖాతా ఉచిత అంతర్జాతీయ లేదా రూపే డెబిట్ కార్డ్‌లు, నెఫ్ట్, ఆర్టీజీఎస్ బదిలీలు, ఫోన్ బ్యాంకింగ్‌లను అందిస్తుంది. అంతేకాకుండా ఖాతాదారులు ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నెలకు నాలుగు సార్లు నగదును ఉచితంగా తీసుకోవచ్చు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
చెల్లుబాటు అయ్యే కేవైసీ పత్రాలను కలిగి ఉన్న ఎవరైనా ఈ ఎస్‌బీఐ సేవింగ్స్ ఖాతాను తెరవగలరు, దీనికి గరిష్ట బ్యాలెన్స్‌పై పరిమితి లేదు. ఖాతాదారు ప్రాథమిక రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్‌ను అందుకుంటారు. ఏదైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లేదా ఏటీఎంలో ద్వారా విత్‌డ్రా చేసుకునే సదుపాయం కూడా ఉంది.
యాక్సిస్ జీరో బ్యాలెన్స్ ఖాతా
రూపే కోసం జీరో బ్యాలెన్స్ డెబిట్ కార్డ్‌తో రూ. 10,000 వరకు నగదు రూపంలో ఉంచవచ్చు. అదనంగా ప్రతి నెలా అదనపు బ్యాంకు నుంచి నాలుగు ఏటీఎం ఉపసంహరణలు కూడా కాంప్లిమెంటరీగా ఉంటాయి.
ఇండస్ ఇండ్ జీరో బ్యాలెన్స్ ఖాతా
కనీసం 18 సంవత్సరాలు నిండిన భారతీయ పౌరులు ఇక్కడ జీరో బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతాకు అర్హులు. ప్రతి నెలా పాస్‌బుక్, డెబిట్ కార్డ్, చెక్‌బుక్ కోసం ఐదు ఉచిత లావాదేవీలు ఉన్నాయి. అంతేకాకుండా ఆర్టీజీఎస్, నెఫ్ట్‌ద్వారా ఫండ్ బదిలీలు కూడా ఉచితంగా చేయవచ్చు.
ఏయూ డిజిటల్ సేవింగ్స్ ఖాతా
అన్ని బ్యాంకింగ్, ఆర్థిక సంబంధిత వ్యాపారాలను వీడియో చాట్‌ల ద్వారా నిర్వహించాలనే ఆలోచనను ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అందించింది. ఫలితంగా ఖాతా తెరవడం నుంచి డిపాజిట్ చేయడం వరకు లేదా మరేదైనా ప్రశ్న కోసం ఒకరు బ్యాంక్‌తో వీడియో కాల్‌ని ప్రారంభిస్తారు. దీనిలో ప్రశ్నలకు బ్యాంకు ఉద్యోగి నిజ సమయంలో సమాధానాలు ఇస్తారు. ఫోర్బ్స్ ప్రకారం మీరు ఇక్కడ చాలా సులభంగా జీరో బ్యాలెన్స్ ఖాతాను తెరవవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం