AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OPPO Find X9: అదిరిపోయే డిజైన్‌తో ఒప్పో నుంచి రెండు కొత్త ఫోన్లు! ధర ఎంతంటే..

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో నుంచి రెండు ఫ్లాగ్ షిప్ ఫోన్లు రాబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా OPPO Find X9 సిరీస్ ఫోన్లు అక్టోబర్ 28 న రిలీజ్ అవ్వబోతున్నాయి. ఈ సిరీస్‌లో Find X9, Find X9 Pro అను రెండు మోడల్స్ ఉంటాయి. వీటి గురించిన మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

OPPO Find X9: అదిరిపోయే డిజైన్‌తో ఒప్పో నుంచి రెండు కొత్త ఫోన్లు! ధర ఎంతంటే..
Oppo Find X9
Nikhil
|

Updated on: Oct 27, 2025 | 12:47 PM

Share

ఒప్పో నుంచి రాబోతున్న రెండు కొత్త మొబైల్స్‌లో అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఉండబోతున్నాయి. ఈ రెండు మొబైల్స్‌లో  ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండబోతోంది. వీటిలో 1.15mm బెజెల్స్ తో పెద్ద స్క్రీన్ ఉంటుంది. అలాగే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్ పై పనిచేస్తుంది. స్పేస్ బ్లాక్, టైటానియం గ్రే, వెల్వెట్ రెడ్, సిల్క్ వైట్ , టైటానియం చార్‌కోల్ ఇలా మల్టిపుల్ కలర్ ఆప్షన్స్‌ ఉండబోతున్నాయి. ఇక స్పెసిఫికేషన్ల వివరాల్లోకి వెళ్తే..

స్పెసిఫికేషన్లు

ఒప్పో ఫైండ్ X9 ప్రో స్మార్ట్ ఫోన్ 6.78-అంగుళాల LTPO డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే ఫైండ్ X9 6.59- అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. రెండూ స్మార్ట్ ఫోన్లు 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తాయి. పీక్ బ్రైట్‌నెస్ 3600 ఉంటుంది. ఇక ప్రాసెసర్ విషయానికొస్తే.. రెండు ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్ ద్వారా పని చేస్తాయి. 16GB వరకు ర్యామ్, 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఇవి ఆండ్రాయిడ్ 16 బేస్డ్ కలర్ ఓఎస్ 16 పై రన్ అవుతాయి.

కెమెరా

ఇక ఈ ఫోన్‌లో కెమెరా సెటప్ హైలైట్‌గా నిలువనుంది. ఒప్పో ఫైండ్ X9 స్మార్ట్‌ఫోన్‌లో 50MP సోనీ సెన్సార్‌‌తో పాటు మరో  50MP సోనీ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ అలాగే 50MP శాంసంగ్ అల్ట్రావైడ్ సెన్సర్  కెమెరాలు ఉన్నాయి. ముందువైపు 32MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇక ఒప్పో ఫైండ్ X9 Proలో ప్రైమరీ కెమెరా 200MP పెరిస్కోప్ టెలిఫోటో సెన్సర్ ను కలిగి ఉంది. ఇందులో సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా అమర్చారు.

ధరలు

ఒప్పో ఫైండ్ X9 ప్రో 7,500mAh బ్యాటరీ ఉండగా ఫైండ్ X9లో 7,025mAh బ్యాటరీ ఉంది. రెండూ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. ఇక ధరల విషయానికొస్తే.. ఒప్పో ఫైండ్ X9 స్మార్ట్ ఫోన్ 12GB+256GB స్టోరేజీ వేరియంట్ ధర సుమారు రూ. 54,300 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే ఒప్పో ఫైండ్ X9 ప్రో 12GB+256GB స్టోరేజీ వేరియంట్ ధర సుమారు రూ. 65,400 నుంచి ప్రారంభమవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి