Amazon Prime Day Sale Postponed: భారత్ కరోనా కరాలా నృత్యం కొనసాగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా రోజురోజుకీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కేసుల సంఖ్యతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో బెడ్లు లేక ఆక్సిజన్ అందక చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఈ క్రమంలోనే కరోనా మహమ్మారి అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా వ్యాపార రంగాలపై దీని ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ప్రజలు కూడా విలాస వస్తువలుపై కాకుండా కేవలం ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రముఖ ఆన్‌లైన్ మార్కెటింగ్ దిగ్గజం అమేజన్ కీలక నిర్ణయం తీసుకుంది. అమేజాన్ ఇటీవల ప్రైమ్ డే సేల్ పేరిట ఓ భారీ సేల్‌ను ప్రకటించింది. ప్రతీ ఏటా నిర్వహించే ఈ సేల్‌లో భాగంగా ఈ ఏడాది కూడా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్ వస్తువులపై ఆఫర్లు ప్రకటించింది. అయితే తాజాగా దేశంలో కరోనా కేసులు ఓ రేంజ్‌లో పెరుగుతుండడంతో అమేజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ప్రైమ్ డే సేల్‌ను వాయిదా వేస్తున్నట్లు అమెజాన్ ఇండియా ప్రకటించింది. ఇక గతేడాది కూడా కరోనా విలయతాండవం చేయండంతో అమేజన్ ఈ సేల్‌ను ఆగస్టులో నిర్వహించింది. మరి దేశాన్ని అతలాకుతలం చేస్తోన్న ఈ మహమ్మారి ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి.
Also Read: EDLI Scheme: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.? అయితే రూ. 7 లక్షలు పొందవచ్చు.. ఎలాగంటే.!
MEIL: కరోనా బాధితులకు అండగా మేఘా సంస్థ.. ఆసుపత్రులకు ఉచిత ఆక్సిజన్ సరఫరాకు ముందుకొచ్చిన ఎంఈఐఎల్
ఇండియాలో వెల్లువెత్తిన యూపీఐ చెల్లింపుల లావాదేవీలు, గూగుల్ పే ని అధిగమించిన ఫోన్ పే