Online Payments: ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేసేవారికి గూగుల్‌ కీలక ప్రకటన.. ఇక నుంచి ఆ వివరాలు ఉండవు..!

|

Dec 03, 2021 | 9:59 PM

Online Payments: ప్రస్తుతం డిజిటల్‌ చెల్లింపులు పెరిగిపోయాయి. ప్రతి బిల్లును కూడా డిజిటల్‌ చెల్లింపుల యాప్‌ల నుంచి చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్‌, ఇతర మార్గాల..

Online Payments: ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేసేవారికి గూగుల్‌ కీలక ప్రకటన.. ఇక నుంచి ఆ వివరాలు ఉండవు..!
Follow us on

Online Payments: ప్రస్తుతం డిజిటల్‌ చెల్లింపులు పెరిగిపోయాయి. ప్రతి బిల్లును కూడా డిజిటల్‌ చెల్లింపుల యాప్‌ల నుంచి చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్‌, ఇతర మార్గాల ద్వారా పేమెంట్లు చేసేవాళ్లకు గూగుల్‌ కీలక సూచన చేసింది. 2022 జనవరి 1 నుంచి వినియోగదారులు కార్డు వివరాలు సేవ్‌ చేయబోమని స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌ పేమెంట్‌, క్రెడిట్‌ కార్డు, ఏటీఎంల చెల్లింపుల విషయంలో ఇది వర్తిస్తుందని పేర్కొంది. అయితే సాధారణ ప్రతి కార్డుదారుడు పేమెంట్‌ చేసిన తర్వాత నెలనెల పేమెంట్లు చేసే సమయంలో కార్డు నెంబర్‌, ఎక్స్‌పైరీ డేట్‌ అనేవి ఆటోమేటిక్‌గా కనిపిస్తుంటాయి. ఇతర కార్డు వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. ఒక్క పిన్‌ నెంబర్‌ ఎంటర్‌ చేస్తే పేమెంట్‌ సక్సెస్‌ అవుతుంది. అయితే ఇక నుంచి గూగుల్‌ యాప్‌లో ఇలాంటి అంశాలేమి కనిపించవు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తీసుకొచ్చిన కార్డు స్టోరేజీ రెగ్యులేషన్స్‌ను పాటిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్‌ తెలిపింది.

ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేయాలి..

కాగా, గూగుల్‌ ప్లే అకౌంట్‌, గూగుల్‌ వర్క్‌ అకౌంట్‌, గూగుల్‌ క్లౌడ్‌లో రికార్డు అయిన వివరాలు పని చేయవు. 2022 జనవరి నుంచి ఇదే కార్డును ఉపయోగించుకునేవాళ్లు ఎప్పటికప్పుడు కార్డు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని గూగుల్‌ తెలిపింది. భారత్‌లో అధికంగా ఉపయోగించేది వీసా, మాస్టర్‌ కార్డులే ఉన్నాయి. వీటి విషయంలో కొంత ఊరట కలిగించింది. వీసా, మాస్టర్‌ కార్డులకు సంబంధించిన డేబిట్‌, క్రెడిట్‌ కార్డు పేమెంట్స్‌ చేయాలనుకుంటే ఈనెల 31లోపు కార్డు వివరాలు రీ-ఎంటర్‌ చేయాలని, ఆ తర్వాత పేమెంట్‌ చేస్తే ఆ వివరాలు కొనసాగుతాయని తెలిపింది.

ఇవి కూడా చదవండి:

Bounce Electric Scooter: మార్కెట్లో మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. అదిరిపోయే ఫీచర్స్‌..!

Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. కేవలం 35 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌.. పూర్తి వివరాలు..!