ITR Filing: మీరు రూ.10 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తే ఎంత పన్ను చెల్లించాలి..? ఎంత మినహాయింపు ఉంటుంది.. పూర్తి వివరాలు!

|

Jul 19, 2022 | 5:40 PM

ITR Filing: దేశంలో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ గురించి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. ఎందుకంటే రోజురోజుకు నిబంధనలు మారిపోతున్నాయి. మనం సంపాదించే ఆస్తులపై ట్యాక్స్‌ చెల్లించాల్సి..

ITR Filing: మీరు రూ.10 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తే ఎంత పన్ను చెల్లించాలి..? ఎంత మినహాయింపు ఉంటుంది.. పూర్తి వివరాలు!
Itr Filing
Follow us on

ITR Filing: దేశంలో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ గురించి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. ఎందుకంటే రోజురోజుకు నిబంధనలు మారిపోతున్నాయి. మనం సంపాదించే ఆస్తులపై ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఎంత మొత్తంలో సంపాదిస్తే పన్ను చెల్లించాల్సి ఉంటుంది.. ఎవరెవరికి పన్ను మినహాయింపు ఉంటుందనే విషయాలను తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. దేశంలో ప్రస్తుతం రెండు రకాల పన్ను వ్యవస్థలు ఉన్నాయి. కొత్త పన్ను విధానం, పాత పన్ను విధానం. పన్ను చెల్లింపుదారునికి తన ఇష్టానుసారం రెండింటిలో ఒకటి ఎంచుకోవడానికి స్వేచ్ఛ ఉంది. ఒకరి ఆదాయం 10 లక్షల రూపాయలు అయితే, దానిపై ఎంత పన్ను విధించబడుతుందో తెలుసుకోండి. పాత పన్ను విధానం ప్రకారం.. 10 లక్షల ఆదాయంపై 30 శాతం పన్ను మినహాయించబడుతుంది. అయితే కొత్త పన్ను విధానంలో 10 లక్షలపై 20 శాతం పన్ను మినహాయించబడుతుంది. ఇక్కడ మీరు 10 శాతం నష్టాన్ని చవి చూడాల్సి ఉంటుంది. మీరు కొత్త పన్ను విధానాన్ని వర్తింపజేస్తే మీరు 10% పన్ను ఆదా ప్రయోజనాన్ని పొందవచ్చు. అందుకే రెండు వ్యవస్థలకు వాటి స్వంత ప్రయోజనాలు, అప్రయోజనాలు ఉన్నాయి. కొత్త, పాత పన్ను విధానంలో రూ.10 లక్షల ఆదాయంపై ఎంత పన్ను విధిస్తారు..? ఎంత మినహాయింపు ఉంటుందనే విషయం తెలుసుకోండి.

హిందూ అవిభక్త కుటుంబం (HUF), 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు, NRIలు రూ. 2.5 లక్షల సంపాదనపై పాత పన్ను విధానంలో జీరో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కొత్త పన్ను విధానంలో కూడా ఎలాంటి పన్ను విధించబడదు. 2.5 లక్షల నుండి 3 లక్షల వరకు హెచ్‌యుఎఫ్, 60 ఏళ్లలోపు నివాసితులు, ఎన్‌ఆర్‌ఐలు 5% పన్ను చెల్లించాలి. 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న నివాసి వ్యక్తి కానీ, 80 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కొత్త పన్ను విధానంలో 5 శాతం సన్ను చెల్లించాల్సి ఉంటుంది.

హెచ్‌యూఎఫ్‌లు, 60 ఏళ్లలోపు వ్యక్తులు, రూ. 5 నుంచి 7.5 లక్షల ఆదాయం ఉన్న ఎన్‌ఆర్‌ఐలు పాత పన్ను విధానంలో 20% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. HUF, 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న నివాసి వ్యక్తి కానీ 80 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి కూడా 20% పన్ను చెల్లించాలి. HUF, 80 ఏళ్లు పైబడిన వారు కూడా 20% పన్ను చెల్లించాలి. కొత్త పన్ను విధానంలో అన్ని HUFలు, నివాసితులు 10% పన్ను చెల్లించాలి.

ఇవి కూడా చదవండి

60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు,NRIలు రూ. 7.5 లక్షల నుండి రూ. 10 లక్షల మధ్య సంపాదిస్తే పాత పన్ను విధానంలో 20% పన్ను చెల్లించాలి. 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న నివాసి వ్యక్తి కానీ 80 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి కూడా 20% పన్ను చెల్లించాలి. 80 ఏళ్లు పైబడిన వారు కూడా 20% పన్ను చెల్లించాలి. కొత్త పన్ను విధానంలో ఈ నివాసితులు 15% పన్ను చెల్లించాలి.

60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు, NRIలు రూ. 10 లక్షల నుండి 12.5 లక్షల మధ్య సంపాదిస్తే పాత పన్ను విధానంలో 30% పన్ను చెల్లించాలి. 80 ఏళ్లలోపు వారు కూడా 30% పన్ను చెల్లించాలి. అలాగే 80 ఏళ్లు పైబడిన వారు కూడా 30% పన్ను చెల్లించాలి. కొత్త పన్ను విధానం ప్రకారం.. ఈ వ్యక్తులు 20% పన్ను చెల్లించాలి.

60 ఏళ్లలోపు వ్యక్తులు, ఎన్‌ఆర్‌ఐలు రూ. 12.5 లక్షల నుంచి రూ. 15 లక్షల మధ్య సంపాదిస్తే పాత పన్ను విధానంలో 30% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. HUF, 60 ఏళ్లు పైబడిన నివాసి వ్యక్తి కానీ 80 ఏళ్లలోపు వారు కూడా 30% పన్ను చెల్లించాలి. 80 ఏళ్లు పైబడిన వారు కూడా 30% పన్ను చెల్లించాలి. కొత్త పన్ను విధానంలో ఈ నివాసితులు 25% పన్ను చెల్లించాలి.

60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు రూ. 15 లక్షలు, అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్న NRIలు పాత పన్ను విధానంలో 30% పన్ను చెల్లించాలి. 60 ఏళ్లు పైబడిన నివాసి వ్యక్తి కానీ 80 ఏళ్లలోపు వారు కూడా 30% పన్ను చెల్లించాలి. 80 ఏళ్లు పైబడిన వారు కూడా 30% పన్ను చెల్లించాలి. కొత్త పన్ను విధానంలో ఈ నివాసితులు 30% పన్ను చెల్లించాలి.

సర్‌ఛార్జ్ ఎంత ఉంటుంది

50 లక్షల కంటే ఎక్కువ, 1 కోటి కంటే తక్కువ సంపాదిస్తే 10 శాతం సర్‌ఛార్జ్ చెల్లించాలి. రూ.1 కోటి కంటే ఎక్కువ, రూ. 2 కోట్ల కంటే తక్కువ ఆదాయంపై 15%, రూ. 2 కోట్ల కంటే ఎక్కువ,రూ. 5 కోట్ల కంటే తక్కువ ఆదాయంపై 25% సర్‌ఛార్జ్ ఉంటుంది. 5 కోట్ల కంటే ఎక్కువ,10 కోట్ల కంటే తక్కువ సంపాదన కోసం 37 శాతం సర్‌చార్జి చెల్లించాలి.10 కోట్ల కంటే ఎక్కువ సంపాదిస్తే 37 శాతం చెల్లించాలి. అధిక ఆదాయ వర్గానికి చెందిన వ్యక్తులకు సర్‌చార్జి చెల్లించడం తప్పనిసరి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి