Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆగస్టు 15న విడుదల.. మరిన్ని వివరాలు

|

Aug 03, 2021 | 10:53 AM

Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్​పై భారత మార్కెట్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ స్కూటర్​విడుదలకు ముందే అనేక సంచనాలు సృష్టిస్తోంది. ప్రీ బుకింగ్స్‌లో దూసుకుపోతోంది..

Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆగస్టు 15న విడుదల.. మరిన్ని వివరాలు
Ola Electric Scooter
Follow us on

Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్​పై భారత మార్కెట్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ స్కూటర్​విడుదలకు ముందే అనేక సంచనాలు సృష్టిస్తోంది. ప్రీ బుకింగ్స్‌లో దూసుకుపోతోంది. జూలై 15న ప్రీబుకింగ్స్​ ప్రారంభించగా 24 గంటల్లోనే ఒక లక్షకు పైగా బుకింగ్స్​సాధించి రికార్డు సృష్టించింది. తద్వారా ప్రపంచంలోనే ఎక్కువ మంది బుక్​ చేసుకున్న ఈ-స్కూటర్‌గా నిలిచింది. అయితే ఓలా ఎలక్ర్టిక్‌ సీఈవో భవిష్‌ అగర్వాల్‌ మంగళవారం స్కూటర్‌ విడుదల గురించి ప్రకటన చేశారు. ఆగస్టు 15న అధికారికంగా ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌లో వెల్లడించారు.

అయితే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కేవలం రూ.499తో బుక్ చేసుకోవచ్చు. ఇది రిఫండబుల్. ప్రిబుక్ చేసుకున్న వారికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ముందుగా డెలివరీ చేస్తారు. ఈ స్కూటర్‌లో పలు ప్రత్యేకతలు ఉన్నాయి. కీ లేకుండానే స్కూటర్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. మొబైల్ అప్లికేషన్ కూడా ఉండనుంది. మరోవైపు ఈ స్కూటర్‌కు సంబంధించిన ఫీచర్లు, డిజైన్​గురించి ఒక్కొక్కటిగా ఇటీవల కంపెనీ సీఈఓ భవిష్​అగర్వాల్​ ట్వీట్​చేస్తూ అందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్నారు. దీంతో ఓలా ఈవీ టూవీటర్​ స్పీడ్ ఎంత? ఎంత మైలేజీ ఇస్తుంది? దాని ఫీచర్లేంటి? ఎప్పుడు విడుదలవుతుంది? వంటి విషయాలను తెలుసుకునేందుకు బైక్ ప్రియులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, వారి ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేస్తూ భవిష్​అగర్వాల్​తాజాగా ట్వీట్​చేశారు.

ఇక, కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఓలా స్కూటర్‌ను 18 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఈ 50 శాతం ఛార్జ్​తో 75 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. 100 శాతం ఛార్జింగ్​ చేయడం ద్వారా గరిష్టంగా 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. తాజాగా ఓలా స్కూటర్ కలర్ రేంజ్ కూడా వెల్లడైంది. స్కూటర్ మొత్తం 10 కలర్ ఆప్షన్లతో వస్తుంది. ఇందులో మ్యాట్, మెటాలిక్, పాస్టెల్ అనే మూడు వేర్వేరు ఫినిష్‌లు ఉన్నాయి. సిటీ రైడ్ కోసం దీనిని సిద్దం చేస్తున్నారని చెబుతున్నప్పటికీ రాబోయే కాలంలో దీనిని హైవే కోసం కూడా ఉపయోగించవచ్చు. ఓలా కంపెనీ మార్కెట్‌లోని ఇతర స్కూటర్లపై కూడా నిఘా పెడుతోంది. ఈ స్కూటర్ అత్యధిక వేగాన్ని కలిగి ఉంటుందని ఇది అథర్ 450X, బజాజ్ చేతక్‌ను కూడా అధిగమిస్తుందని చెబుతున్నారు.

 

ఇవీ కూడా చదవండి

PM Kisan Scheme: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ స్కీమ్‌ డబ్బులు.. ఎప్పుడంటే..?

WhatsApp: వాట్సాప్‌ నుంచి కొత్త ఫీచర్‌.. హ్యాపీయర్ దెన్ యానిమేటెడ్ స్టిక్కర్స్.. ఎలా డౌన్‌లోడ్‌ చేయాలంటే