రష్యా భారీ డిస్కౌంట్‌తో ముడి చమురు సరఫరా చేయడానికి ముందుకు రావడంతో చమురు కొనేందుకు భారతీయ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ఇప్పటికే మూడు మిలియన్ బ్యారెళ్లు కొనుగోలు చేసింది. తాజాగా హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) రెండు మిలియన్ బ్యారెళ్లు తీసుకుంది. యూరప్‌కు చెందిన ట్రేడరు విటోల్ ద్వారా రష్యన్ ఉరల్స్ క్రూడాయిల్‌ను హెచ్‌పీసీఎల్ కొనుగోలు చేసినట్లు తెలిసింది. మరోవైపు, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ (ఎంఆర్‌పీఎల్) కూడా అదే తరహాలో ఒక మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ కోసం టెండర్లు ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధానికి తిగడంతో అమెరికాతో సహా పలు దేశాలు రష్యాపే ఆంక్షలు విధించాయి. దీంతో అక్కడ ముడి చమురు నిల్వలు పెరిగిపోయాయి. నిల్వలు ఏం చేయాలో అర్థం కాక భారీ డిస్కౌంట్ భారత్‌కు ముడి చమురు సరఫరా చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని, చమురును చౌకగా దక్కించుకునేందుకు భారత రిఫైనింగ్ సంస్థలు క్యూ కడుతున్నాయి. మే నెలలో డెలివరీ కోసం బ్యారెల్‌కు 20–25 డాలర్ల డిస్కౌంట్‌తో ఐవోసీ గత వారమే మూడు మిలియన్ బ్యారెళ్లను విటోల్ సంస్థ ద్వారా కొనుగోలు చేసింది. అమెరికాలో భారీగా కార్యకలాపాలు ఉన్నందున, రష్యాపై ఆంక్షల ప్రభావం తమపై కూడా పడే అవకాశం ఉండటంతో ప్రైవేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం రష్యన్ క్రూడాయిల్‌కు దూరంగా ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అటు ఇరాన్ కూడా భారత్‌కు ముడి చమురు సరఫరా చేసేందుకు ముందుకు వచ్చింది. భారత్‌కి ముడి చమురు అవసరాలను తీర్చడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని భారత్‌లోని ఇరాన్ రాయబారి డాక్టర్ అలీ చెగేని పేర్కొన్నారు. అంతేకాదు రూపాయి-రియాల్ ట్రేడ్ మెకానిజంతో రెండు దేశాల కంపెనీలకు ఒకరితో ఒకరు నేరుగా డీల్ నిర్వహించు కోగలుగుతారని అలీ చెగేని చెప్పారు. గతంలో భారత్ ఇరాన్‌కి ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉండేది.. కానీ ఇరాన్‌పై ఆంక్షల కారణంగా దిగుమతి నిలిపివేయాల్సి వచ్చింది. రష్యా భారీ తగ్గింపుతో ముడి చమురు సరఫరా చేయడం, ఇరాన్ కూడా సరఫరాకు ముందుకు రావడంతో భారత్‌లో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
Read Also.. Mutual Funds: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా.. సిప్, లంప్సమ్‌లో ఏది బెటర్..