Electric Bike: సింగిల్ ఛార్జ్‌కు 150 కి.మీ. వెళ్లే ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్! ధర ఎంతంటే..
ఎలక్ట్రిక్ వెహికల్ అంటే అందరూ స్కూటర్లే అనుకుంటారు. కానీ, ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్స్ కూడా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఇవి హై స్పీడ్ తో వెళ్లడమే కాకుండా మంచి రేంజ్ ను కూడా ఇస్తున్నాయి. అలాంటి ఒక బైక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం బాగా పెరుగుతోంది. పెట్రోల్ ధరలు, పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని చాలామంది ఈవీలకు షిఫ్ట్ అవుతున్నారు. దాంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ సెగ్మెంట్‌లోకి స్పోర్ట్స్ బైక్స్ కూడా ఎంట్రీ ఇస్తున్నాయి. ఇందులోభాగంగానే ఒబెన్ ఎలక్ట్రిక్ అనే కంపెనీ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్స్‌పై ఫోకస్ పెట్టింది. స్పోర్ట్స్ బైక్ కొనాలనుకునే వారు ఈ బైక్స్ పై ఓ లుక్కేయొచ్చు.
ఒబెన్ ఎలక్ట్రిక్
మార్కెట్లో ఇప్పటికే అనేక ఎలక్ట్రిక్ స్కూటీలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్స్ కూడా మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. ముఖ్యంగా ఒబెన్ ఎలక్ట్రిక్ కంపెనీ ప్రవేశపెట్టిన స్పోర్ట్స్ బైక్స్ డిజైన్స్ చాలా యునిక్ గా ఉన్నాయి. వీటిలో ఒబెన్ రోర్ EZ-3, రోర్ EZ-4, రోర్ సిగ్మా వంటి మోడల్స్ ఉన్నాయి. వీటిలో 3.4kW 4.4kW .. ఇలా మల్టిపుల్ వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి సింగిల్ ఛార్జ్‌కు 150 నుంచి 180 కిలోమీటర్ల వరకు వెళ్తాయి.
ఫీచర్లు ఇవే..
ఒబెన్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్స్ లో ఎకో మోడ్, సిటీ మోడ్, హావోక్ మోడ్ అను మూడు రకాల మోడ్స్ ఉంటాయి. ఎకో మోడ్ లో 40kmph స్పీడ్ తో 150 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. సిటీ మోడ్ లో 60kmph స్పీడ్ తో 110 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. హావోక్ మోడ్ తో 95 kmph స్పీడ్ తో 90 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇకపోతే ఇందులో స్మార్ట్ డిస్ప్లే, కాల్ అలర్ట్స్, నావిగేషన్, టెక్స్ట్ అలర్ట్స్, ట్రిప్ మీటర్, మ్యూజిక్ ఇన్ఫో, డ్రైవర్ అలెర్ట్ సిస్టం, రివర్స్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఇవి ట్యూబ్ లెస్ టైర్స్, డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, ఎల్ఈడీ హెడ్ లాంప్‌తో వస్తాయి. వీటి ధరలు రూ. 1,36,297 నుంచి మొదలవుతాయి.




