ఆ పొదుపు ఖాతాదారులకి హెచ్చరిక.. మార్చిలో ఈ పని చేయకపోతే పెనాల్టీలు భరించలేరు..!

|

Mar 05, 2022 | 4:31 PM

PPF,NPS, SSY: మీకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS), సుకన్య సమృద్ధి యోజన (SSY) ఖాతాలు ఉంటే ఈ వార్త మీకోసమే. మీ ఖాతా సక్రియంగా ఉందో లేదో

ఆ పొదుపు ఖాతాదారులకి హెచ్చరిక.. మార్చిలో ఈ పని చేయకపోతే పెనాల్టీలు భరించలేరు..!
Money
Follow us on

PPF,NPS, SSY: మీకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS), సుకన్య సమృద్ధి యోజన (SSY) ఖాతాలు ఉంటే ఈ వార్త మీకోసమే. మీ ఖాతా సక్రియంగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ ఆర్థిక సంవత్సరంలో కనీస మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. PPF, NPS, సుకన్య సమృద్ధి యోజన వంటి పన్ను ఆదా పథకాలలో మీరు కనీస నిల్వను నిర్వహించడం తప్పనిసరి అని గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు మీరు ఈ ఖాతాలను తనిఖీ చేయకుంటే ఈరోజే వాటిని తనిఖీ చేయండి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ఖాతాల్లో ఎలాంటి డబ్బు జమ చేయకుంటే మార్చి 31లోగా కనీస మొత్తాన్ని డిపాజిట్‌ చేయండి. లేదంటే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి ఈ ఖాతాలు ఒకసారి డీయాక్టివేట్ అయితే వాటిని మళ్లీ యాక్టివేట్ చేయడానికి కచ్చితంగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

PPFలో డిపాజిట్ చేయవలసిన కనీస మొత్తం

ఒక ఆర్థిక సంవత్సరానికి PPFలో కనీస వార్షిక మొత్తం రూ.500. చివరి తేదీ మార్చి 31, 2022 అని గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయకపోతే వెంటనే చేయండి. లేదంటే సంవత్సరానికి రూ. 50 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

NPSలో డిపాజిట్ చేయవలసిన కనీస మొత్తం

నిబంధనల ప్రకారం.. టైర్-I NPS ఖాతాదారులు ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.1,000 డిపాజిట్ చేయడం తప్పనిసరి. లేదంటే ఖాతా నిష్క్రియంగా మారుతుంది. ఇందుకోసం రూ.100 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. టైర్ II ఎన్‌పిఎస్ ఖాతా ఉంటే ఖాతా ఫ్రీజింగ్‌తో పాటు ఆటోమేటిక్‌గా క్లోజ్‌ అవుతుంది.

సుకన్య సమృద్ధి ఖాతా పథకం

సుకన్య సమృద్ధి ఖాతాలో ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250 డిపాజిట్ చేయడం తప్పనిసరి. లేదంటే రూ.50 జరిమానా విధిస్తారు. SSY ఖాతా తెరిచిన తేదీ నుంచి15 సంవత్సరాలు పూర్తయ్యే లోపు డిఫాల్ట్ ఖాతాను క్రమబద్ధీకరించుకోవచ్చు. మీరు ఇంకా ఈ ఖాతాలో కనీస మొత్తాన్ని డిపాజిట్‌ చేయకుంటే తనిఖీ చేసి అప్‌డేట్ చేయండి.

IND W vs PAK W: సూపర్‌ సండే.. భారత్, పాకిస్తాన్‌ మధ్య రసవత్తర పోరు.. రికార్డులు బ్రేకయ్యేనా..!

Driving License: కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేస్తున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు గమనించండి..!

PPF Account: పీపీఎఫ్ ఖాతా నిబంధనలలో మార్పులు.. తెలుసుకోపోతే పెద్ద నష్టం..!