Royal Enfield Bullet: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్‌కి ఇండియాలో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చాలా మంది వ్యక్తులు రేసింగ్ బైక్‌లను ఇష్టపడతారు కానీ కొంతమంది హుందా వ్యక్తులు మాత్రమే రాయల్ ఎన్‌ఫీల్డ్‌ని ఇష్టపడుతారు. ఈ బైక్ దృఢత్వాన్ని , స్టైలిష్ లుక్‌ని చాలామంది లైక్ చేస్తారు. మీరు ఈ బైక్ కొనడానికి షోరూమ్‌కి వెళితే ధర కూడా ఎక్కువే ఉంటుంది. కానీ ఈ రోజు ఒక ఆఫర్‌లో దానిని తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. బైక్ ఫీచర్ల గురించి మాట్లాడితే దాని డిజైన్ చాలా బలంగా ఉంటుంది. కంపెనీ దీనిని ఒకే ఒక వేరియంట్‌లో లాంచ్ చేసింది. మీరు బైక్‌లో 346cc ఇంజిన్ పొందుతారు. ఇది ఎయిర్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది.
ఈ ఇంజన్ 19.36 పిఎస్ పవర్, 28 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఇస్తుంది. ఇందులో మీరు 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ పొందుతారు. మైలేజీకి సంబంధించి లీటర్‌కి 40.8 కిమీ ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. ఆఫర్ గురించి మాట్లాడితే.. సెకండ్ హ్యాండ్ వెహికల్ విక్రయించే వెబ్‌సైట్ CARS24 తన సైట్‌లో ఈ బైక్‌ని లిస్ట్ చేసింది. ధర రూ.86 వేల వద్ద విక్రయానికి రెడీగా ఉంది. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం బైక్ మోడల్ 2016 నాటిది.
అదే సమయంలో దాని యాజమాన్యం కూడా మొదటిది. ఈ బైక్ ఇప్పటివరకు 8986 కి.మీ. తిరిగింది. దీని నమోదు హర్యానాలోని HR 26 RTO. మీరు ఈ బైక్ తీసుకుంటే సంవత్సరం వారంటీ లభిస్తుంది. ఇది కాకుండా 7 రోజుల మనీ బ్యాక్ గ్యారెంటీ కూడా లభిస్తుంది. 7 రోజుల మనీ బ్యాక్ గ్యారెంటీ అంటే 7 రోజుల్లోపు ఈ బైక్ నచ్చకపోతే మీరు ఈ బైక్‌ని తిరిగి అప్పగించవచ్చు. మీ పూర్తి డబ్బును తిరిగి పొందవచ్చు.
గమనిక: ఈ సమాచారం కేవలం CARS24 వెబ్‌సైట్ నుంచి తీసుకోబడింది.. దీనికి టీవీ9 సంస్థకి ఎలాంటి సంబంధం లేదని గుర్తించండి. మరిన్ని వివరాల కోసం CARS24 వెబ్‌సైట్‌ని సందర్శించండి.