SBI Customers : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు బ్యాంకులు, ఎటిఎంలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలు, సోషల్ మీడియా ద్వారా అనేక సేవలను అందిస్తుంది. బ్యాంకింగ్ మోసాలను నివారించడానికి తగిన సలహాలు ఇస్తుంది. ప్రస్తుతం ప్రజలు తమ బ్యాంక్ ఖాతాకు సంబంధించిన సమస్యను ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు. దీనికి ఎస్బిఐ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి సమాధానం ఇస్తోంది. అయితే ట్విట్టర్ ద్వారా సమస్యలు తెలియజేస్తున్న కస్టమర్లను బ్యాంక్ హెచ్చరించింది. పర్సనల్ విషయాలను పోస్ట్ చేయడాన్ని నిషేధించింది. మీరు ట్విట్టర్ ద్వారా బ్యాంక్ నుంచి సమాచారం పొందాలనుకుంటే బ్యాంకు విధించిన నిబంధనలను పాటించాలి.
బ్యాంక్ ఏం చెబుతోంది..
వాస్తవానికి చాలా మంది సోషల్ మీడియా ద్వారా బ్యాంక్ నుంచి సహాయం కోరినప్పుడు లేదా ఫిర్యాదు చేసినప్పుడు వారు తమ ఖాతా వివరాలు, డెబిట్ కార్డు నంబర్, ఆధార్ కార్డు వివరాలను సోషల్ మీడియా పోస్టులలో షేర్ చేస్తారు. బ్యాంక్ ప్రకారం వినియోగదారులు తమ వ్యక్తిగత సమాచారాన్ని పబ్లిక్ పోర్టల్‌లో షేర్ చేయకూడదు.కస్టమర్ ఖాతాకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా అవి దుర్వినయోగం అయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తుంది. తరువాత ఖాతాకు సంబంధించి ఏదైనా మోసం జరిగితే బ్యాంకు దానికి బాధ్యత వహించదని స్పష్టం చేస్తుంది. మీరు ఇలాంటి పోస్టులు షేర్ చేయకపోవడమే మంచిది. మీరు ఒకవేళ మీ వివరాలను షేర్ చేయాలనుకుంటే బ్యాంకుకు సందేశం పంపండి కానీ ఎప్పుడు షేర్ చేయవద్దని కోరుతుంది.
ఇదిలా ఉంటే జూలై 1, 2021 నుంచి బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బిఎస్బిడి) ఖాతాలపై ఎస్బిఐ కొత్త నియమాలు వర్తిస్తాయి. కస్టమర్లు నగదు ఉపసంహరణకు, చెక్ బుక్ పొందటానికి ఎక్కువ చెల్లించవలసి ఉంటుంది. ఎస్బీఐ నుంచి ఇప్పుడు కేవలం 4 ఉచిత లావీదేవీలు మాత్రమే నిర్వహించవచ్చు. అంతకు మించి చేస్తే ఎక్కువ వసూలు చేయడానికి సిద్దంగా ఉంది. హోమ్ బ్రాంచ్‌కి కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. ఖాతాదారులు ఈ విషయాలను గమనించి బ్యాంకు లావాదేవీలు నిర్వహస్తే మంచిది.