UPI Charges: యూపీఐ యూజర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఛార్జీల పెంపుపై కేంద్రం క్లారిటీ!
యూపీఐ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని ప్రకటించింది. యూపీఐ లావాదేవీలు, డెబిట్ కార్టు చెల్లింపులపై ఛార్జీలు వేస్తారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాటి వాస్తవం లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధిస్తారు, క్రెడికార్లు చెల్లింపులపై డబ్బులు వసూలు చేస్తారని సోషల్ మీడియాలో జరుగున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం క్లిరటీ ఇచ్చింది. యూపీఐలో రూ. 2,000 లోపు చేసే లావాదేవీలతో పాటు రూపే (RuPay) డెబిట్ కార్డు చెల్లింపులపై చార్జీలు వసూలు చేస్తారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపింది. బ్యాంకులు గానీ, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు గానీ కస్టమర్లపై ఎలాంటి ప్రత్యక్ష లేదా పరోక్ష ఛార్జీలు వేసేందుకు వీల్లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ‘పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం, 2007’లోని సెక్షన్ 10A ప్రకారం అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది.
గతంలో మాదిరిగానే సామాన్యులకు యూపీఐ సేవలు అందుతాయని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి యూపీఐ సేవలు సామాన్యులకు ఫ్రీగానే అందిస్తున్నట్టు తెలిపారు. రాబోయే రోజుల్లోనూ ఈ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండవని.. ప్రతి భారతీయుడు ఈ సేవలను ఉచితంగా వినియోగించుకోవచ్చని ఆమె చెప్పుకొచ్చారు.
గడిచిన దశాద్ధకాలంలో మన దేశంలో యూపీఐ సేవలు వేగంగా విస్తరించాయిని.. యూపీఐ వినియోగం కూడా రికార్డు స్థానిలో పెరిగిందని ఆమె తెలిపారు. ప్రభుత్వ గణంకాల ప్రకారం.. 2016-17లో జస్ట్ 44 బ్యాంకులకు పరిమితమైన యూపీఐ సేవలు ఇప్పుడు.. 741కి చేరాయని తెలిపారు. అలాగే ప్రారంభంలో 1.78 కోట్లుగా వార్షిక లావాదేవీలు 2026 నాటికి 24,162 కోట్లకు చేరినట్టు తెలిపారు. ఇప్పుడు దేశంలో రోజుకూ రూ. 66 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయన్నారు.
అంతేకాదు 2016-17లో కేవలం రూ. 0.07 లక్షల కోట్లుగా ఉన్న లావాదేవీల విలువ, ఇప్పుడు ఏకంగా రూ. 314 లక్షల కోట్లకు పెరిగినట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న డిజిటల్ లావాదేవీల్లో యూపీఐ వాటానే దాదాపు 84 శాతంగా ఉన్నట్టు తెలిపారు. ఈ లావాదేవీల్లో ఎక్కవ శాతం చిరు వ్యాపారులవే ఉన్నట్టు తెలిపారు. మొత్తం లావాదేవీల్లో 63 శాతం వాటా వారిదేనని.. ఇందులోనూ దాదాపు రూ.500లోపు చెల్లింపులే ఎక్కువున్నట్టు తెలిపారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
