AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాహిత్య అకాడమీలో ఉద్యోగాలు.. టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ మార్కులతో నేరుగా సర్కార్ కొలువులు

న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంతో పాటు వివిధ ప్రాంతీయ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ సాహిత్య అకాడమీ నోటిఫికేషన్ విడుదల చేసింది. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన టెన్త్,ఇంటర్, డిగ్రీ మార్కులతో నేరుగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు..

సాహిత్య అకాడమీలో ఉద్యోగాలు.. టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ మార్కులతో నేరుగా సర్కార్ కొలువులు
Sahitya Akademi Recruitment
Srilakshmi C
|

Updated on: Sep 15, 2026 | 7:43 AM

Share

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ సాహిత్య సంస్థ సాహిత్య అకాడమీ మంచి అవకాశం కల్పిస్తోంది. న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంతో పాటు వివిధ ప్రాంతీయ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ సాహిత్య అకాడమీ నోటిఫికేషన్ విడుదల చేసింది. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన మొత్తం 30 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబరు 21, 2026వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు..

విభాగాల వారీగా ఖాళీల వివరాలు

  • డిప్యూటీ సెక్రటరీ (జనరల్-అడ్మిన్) పోస్టుల సంఖ్య: 1
  • అసిస్టెంట్ ఎడిటర్ పోస్టుల సంఖ్య: 1
  • సీనియర్ లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య: 2
  • జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 1
  • ప్రోగ్రామ్, పబ్లికేషన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య: 7
  • ప్రూఫ్ రీడర్ కమ్ జనరల్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య: 2
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II పోస్టుల సంఖ్య: 4
  • మెసెంజర్ కమ్ రైడర్ పోస్టుల సంఖ్య: 1
  • వ్యాన్ డ్రైవర్ పోస్టుల సంఖ్య: 1
  • జూనియర్ క్లర్క్ పోస్టుల సంఖ్య: 4
  • మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల సంఖ్య: 6

పోస్టును బట్టి అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి టెన్త్, ఇంటర్ లేదా ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పోస్టుకు అవసరమైన విద్యార్హతతో పాటు పని అనుభవం కూడా ఉండాలి. పోస్టుల వారీగా అర్హతలు, అనుభవ నిబంధనలు వేర్వేరుగా ఉండే అవకాశం ఉన్నందున అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించాలి. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 50 సంవత్సరాలుగా నిర్ణయించారు. పోస్టును బట్టి వయోపరిమితి, సడలింపులకు సంబంధించిన నిబంధనలు మారవచ్చు. ఈ అర్హతలు కలిగిన వారు నిర్ణీత నమూనాలో దరఖాస్తును పూర్తి చేసి, అవసరమైన ధ్రువపత్రాలను జతచేసి పోస్టు ద్వారా ఈ కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా పంపించాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. పోస్టును బట్టి అదనపు అర్హతలు, ఇతర ఎంపిక నిబంధనలు మారే అవకాశం ఉంది. ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకు రూ.18,000 నుంచి రూ.1,12,400 వరకు జీతం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా

సాహిత్య అకాడమీ (Sahitya Akademi), రవీంద్ర భవన్, ఫిరోజ్‌షా మార్గ్, న్యూఢిల్లీ. సాహిత్య అకాడమీలో ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us