AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card: క్రెడిట్ కార్డు రావడం లేదా..? ఈ మార్గాల ద్వారా ఎవరైనా పొందే ఛాన్స్..

క్రెడిట్ కార్డు కావాలనుకుంటున్నారా.. కానీ ఇన్‌కమ్ ప్రూఫ్ లేదా.. మీరు ఎలాంటి ఆదాయం సంపాదించడం లేదా.. అయినా క్రెడిట్ కార్డు సులువుగా పొందవచ్చు. ఇందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయని చెప్పవచ్చు. సామాన్యులు కూడా ఈ మార్గాల ద్వారా సులువుగా కార్డు పొందవచ్చు.

Credit Card: క్రెడిట్ కార్డు రావడం లేదా..? ఈ మార్గాల ద్వారా ఎవరైనా పొందే ఛాన్స్..
Credit Card
Venkatrao Lella
|

Updated on: Jun 09, 2026 | 11:20 AM

Share

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీఒక్కరూ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నారు. అత్యవసరంగా డబ్బులు అవసరమైనప్పుడు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో కొంతమంది వాడుతుంటే.. మరికొంతమంది ఆఫర్లు, డిస్కౌంట్స్ కోసం వినియోగిస్తున్నారు. ఉద్యోగులు, వ్యాపారులే కాకుండా సామాన్యులు కూడా ఇటీవల క్రెడిట్ కార్డును వాడుతున్నారు. అయితే క్రెడిట్ కార్డు కావాలంటే ఉద్యోగం చేస్తూ శాలరీ స్లిప్ ఉండాలని చాలామంది అనుకుంటారు. అయితే ఇన్‌కమ్ ప్రూఫ్ లేకపోయినా మీరు కార్డును పొందవచ్చు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బ్యాంకులు ఇన్‌కమ్ ప్రూఫ్ లేకపోయినా కార్డులు మంజూరు చేస్తున్నాయి. ఇందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అదెలా అనేది ఇప్పుడు చూద్దాం.

ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం ద్వారా..

కొన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్‌ అధారిత క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. అంటే మీరు ముందు కొంత మొత్తంలో బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో జమ చేయాల్సి ఉంటుంది. ఈ అమౌంట్‌పు పూచీకత్తుగా పెట్టుకుని బ్యాంకులు కార్డును జారీ చేస్తాయి. మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో బ్యాంక్‌కు సెక్యూరిటీగా చెల్లిస్తున్నారు కాబట్టి ఎలాంటి పత్రాలు చూపించాల్సిన అవసరం అనేది ఉండదు.

బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం

మీరు సేవింగ్స్ అకౌంట్లలో నిరంతరం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ అకౌంట్ ఎన్నో ఏళ్లుగా వాడుతుంటే బ్యాంకులు మీకు క్రెడిట్ కార్డును ఆటోమేటిక్‌గా జారీ చేస్తాయి. మీరు ఇందుకోసం ఎలాంటి రిక్వెస్ట్ పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. మీ అకౌంట్ క్రెడిట్ మిస్టరీ, ట్రాన్సాక్షన్ల హిస్టరీ ఆధారంగా కార్డును అందిస్తాయి.

యాడ్ ఆన్ కార్డులు

మీ కుటుంబంలో ఎవరికైనా కార్డు ఉంటే.. వారి కార్డు ఆధారంగా మీకు యాడ్ ఆన్ కార్డ్ కింద కొత్త కార్డు అందిస్తారు. ఇందుకోసం మీరు ఆదాయానికి సంబంధించిన ఆధారాలను సమర్పించాల్సిన అవసరం ఉండదు. అలాగే మరొకరు కార్డుకు కో అప్లికేంట్‌ లేదా గ్యారంటర్‌గా మారడం ద్వారా కూడా కార్డును పొందవచ్చు.

సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉంటే..

ఇక మీకు ఆదాయం లేకపోయినా మీ సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉంటే మిమ్మల్ని నమ్మదగిన కస్టమర్‌గా బ్యాంకులు భావిస్తాయి. ఇలాంటి సమయంలో మీ ఆదాయ వనరులు చూడకుండానే బ్యాంకులు క్రెడిట్ కార్డును మంజూరు చేస్తాయి. దీంతో క్రెడిట్ స్కోర్‌ను జాగ్రత్తగా కాపాడుకోండి. ఒక్కసారి సిబిల్ స్కోర్ పోతే మళ్లీ తిరిగి తెచ్చుకోవడం కష్టతరమైన పని. అందుకే సకాలంలో బిల్లులు చెల్లిస్తూ సిబిల్ స్కోర్‌ను కాపాడుకోడం ముఖ్యం. ఇలా మీ దగ్గర ఇన్‌కమ్ ప్రూఫ్ లేకపోయినా క్రెడిట్ కార్డును బ్యాంకుల ద్వారా పొందవచ్చు.

Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!