No Cost EMI: పండగ సీజన్‌లో, ఇతర సీజన్‌లలో ఈకామర్స్ దిగ్గజాలు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వస్తువులపై బంపర్ ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తుంటాయి. అలాగే మనం ఏదైనా వస్తువును కొనుగోలు చేస్తే నో కాస్ట్ ఈఎంఐ ఉంటుంది. ఇలా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇతర ఆన్‌లైన్ సంస్థలు ప్రత్యేక సేల్ పేరుతో ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఈ ఆఫర్లలో ఎన్నో వస్తువులను తక్కువ ధరలకే కొనుగోలు చేయవచ్చు. ఇక నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది.
అయితే మనలో చాలా మందికి ఒక ప్రశ్న మదిలో మెదులుతుంది. అసలు నిజంగానే మనకు నో-కాస్ట్ ఈఎంఐ వల్ల లాభం ఉంటుందా..? అని. దీని గురించి వివరంగా తెలుసుకుందాం. దాదాపు అన్ని వస్తువులపై నో కాస్ట్ ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. డబ్బులు లేకపోయినా ఏమి కావాలన్నా కొనే అవకాశం రావడంతో చాలా మంది ఈఎంఐ రూపంలో కొనుగోలు చేస్తుంటారు. అది కూడా వడ్డీ లేకుండా నో-కాస్ట్ ఈఎంఐ ద్వారా లభిస్తుండటంతో షాపింగ్ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు.
నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే?
సాధారణ ఈఎంఐతో పోలిస్తే నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే? మీరు ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు మీరు రూ.19 వేలు విలువైన మొబైల్ కొన్నప్పుడు మీరు 5 నెలల కాలానికి ఒక రూ.1000 వడ్డీ అవుతుందనుకుందాం. ఇప్పుడు మొత్తం రూ.20,000 చెల్లించాలి. 10 నెలలకు ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే నెలకు రూ.2,000 చొప్పున చెల్లిస్తే సరిపోతుంది. అదే మీరు నో కాస్ట్ ఈఎమ్ఐ ఆప్షన్ ఎంచుకున్నట్లయితే ఎంత అయితే వస్తువు ధర ఉంటుందో అంతే మొత్తాన్ని వాయిదాల పద్దతుల్లో చెల్లించాల్సి ఉంటుంది. అంతకు మించి చెల్లించాల్సిన అవసరం లేదు.
ఇంకో విషయం ఏంటంటే.. మీరు ఏదైనా వస్తువును కొనుగోలు చేస్తే ఈఎంఐ ఆప్షన్ ఎంచుకున్నప్పుడు కొంత మొత్తం డిస్కౌంట్ లభిస్తుంది. కానీ అదే నో కాస్ట్ ఈఎంఐ ఎంచుకున్నట్లయితే మీకు ఎలాంటి డిస్కౌంట్ వర్తించదు. దీంతో మీరు డిస్కౌంట్ కోల్పోయినట్టే. అంటే మీరు పేమెంట్ చేస్తే వచ్చే సాధారణ ఈఎంఐ లభించే డిస్కౌంట్‌ను మీరు ముందే చెల్లిస్తారు కాబట్టి వస్తువు అమ్మినవారితో పాటు బ్యాంకుకు కూడా లాభమే. నో-కాస్ట్ ఈఎంఐ ద్వారా వస్తువులు కొంటారు కాబట్టి ముందుగా ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. దీని వల్ల వినియోగదారుడికి బ్యాంకుకు ఇద్దరికీ లాభమే ఉంటుంది. అందుకే ఈ-కామర్స్ సంస్థలు నో కాస్ట్ ఈఎమ్ఐను ఎక్కువగా ఆఫర్ చేస్తుంటాయి. ఇలా ఈ-కామర్స్ సంస్థలు ఆఫర్లు ప్రకటించినప్పుడు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను ప్రకటిస్తుంటాయి. అలాంటి సమయాల్లో ప్రొడక్స్ట్‌ను కొనుగోలు చేసే మంచిదే. ఎలాంటి వడ్డీ పడదు.
ఇవి కూడా చదవండి