ముంచుకొస్తున్న మూడు ఉప ద్రవాలు.. భారత ఆర్థిక వ్యవస్థకు పెను అగ్నిపరీక్షలే..?
2026 ప్రారంభంలోనే భారతదేశం మునుపెన్నడూ లేని విధంగా ఒకేసారి పలు అంతర్జాతీయ, దేశీయ సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. సాధారణంగా సంక్షోభాలు విడివిడిగా వస్తాయి, కానీ ప్రస్తుతం చమురు ధరలు, వాతావరణ మార్పులు, ద్రవ్యోల్బణం అన్నీ కలిసి ఒకేసారి దాడి చేస్తున్నాయి. నిజంగానే, భారత ఆర్థిక వ్యవస్థకు ఇది అత్యంత క్లిష్టమైన సంవత్సరం కాబోతోందా..?

“మనం ఇంకా మే నెలలోనే ఉన్నాం..” అంటూ నితిన్ కామత్ చేసిన ఈ చిన్న వ్యాఖ్య వెనుక ఒక పెద్ద ఆర్థిక హెచ్చరిక దాగి ఉంది. 2026 ప్రారంభంలోనే భారతదేశం మునుపెన్నడూ లేని విధంగా ఒకేసారి పలు అంతర్జాతీయ, దేశీయ సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. సాధారణంగా సంక్షోభాలు విడివిడిగా వస్తాయి, కానీ ప్రస్తుతం చమురు ధరలు, వాతావరణ మార్పులు, ద్రవ్యోల్బణం అన్నీ కలిసి ఒకేసారి దాడి చేస్తున్నాయి.
ప్రధానంగా భారతదేశం తన చమురు అవసరాలలో 85% దిగుమతులపైనే ఆధారపడుతుంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా హోర్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న ఉద్రిక్తతలు సఫ్లై చెయిన్‌ను దెబ్బతీశాయి. దీంతో ధరల పెరుగుదల. ఏప్రిల్‌లో బ్యారెల్ చమురు ధర 114 డాలర్లు తాకడం, మేలో కూడా 100 డాలర్లపైన కొనసాగడం దేశ ఆర్థిక వ్యవస్థకు పెను భారం. ముడి చమురు ధరలో ప్రతి 10 డాలర్ల పెరుగుదల, భారతదేశ GDP వృద్ధిని దాదాపు 0.44% (44 బేసిస్ పాయింట్లు) తగ్గించగలదని అంచనా వేస్తున్నారు.
మరోవైపు, భారతదేశంలో వ్యవసాయం ఇప్పటికీ రుతుపవనాల జూదంగా మారిపోయాయి. 2026లో ‘సూపర్ ఎల్ నినో’ ప్రభావం వల్ల పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోద అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. IMD అంచనా ప్రకారం ఈ ఏడాది వర్షపాతం 6% తక్కువగా ఉండవచ్చు. ఇక 60% రైతులు వర్షాలపైనే ఆధారపడటం వల్ల, పంట దిగుబడి తగ్గి గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పడిపోయే ప్రమాదం ఉంది.
గతంలో కేవలం పగటిపూట మాత్రమే ఎండలు ఎక్కువగా ఉండేవి, కానీ ఇప్పుడు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా తగ్గడం లేదు. దీనివల్ల కార్మికుల ఉత్పాదకత దెబ్బతింటోంది. తీవ్రమైన వేడి వల్ల భారత్ సుమారు 150 బిలియన్ డాలర్ల ఆర్థిక ఉత్పత్తిని కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏసీలు, కూలర్ల వాడకం పెరిగి గ్రిడ్లపై ఒత్తిడి పెరుగుతోంది, ఇది పరిశ్రమల నిర్వహణ వ్యయాన్ని పెంచుతోంది.
ఒకవైపు ఇంధన ధరల పెరుగుదల వల్ల రవాణా ఖర్చులు పెరగడం, మరోవైపు వర్షాలు లేక ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడం ‘డబుల్ ఇంపాక్ట్’ను చూపిస్తున్నాయి. ఇప్పటికే అముల్, మదర్ డెయిరీ వంటి సంస్థలు లీటరుకు రూ. 2 పెంచడం ద్రవ్యోల్బణానికి సంకేతం. ధరలు అదుపు తప్పితే, వడ్డీ రేట్లను పెంచక తప్పదు. దీనివల్ల హోమ్ లోన్లు, కార్ లోన్లు భారంగా మారి మార్కెట్లో నగదు లభ్యత తగ్గుతుందంటున్నారు.
2026 is turning out to be a case of when it rains, it pours.
Every few years, the Pacific Ocean warms up abnormally, and that phenomenon is called El Niño. When it happens, India's monsoon weakens. This year, it looks like a super El Niño is developing, and the IMD is already… pic.twitter.com/pBE3g8iOpd
— Nithin Kamath (@Nithin0dha) May 25, 2026
భారతదేశం గతంతో పోలిస్తే ఇప్పుడు ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ, ఈ ‘ట్రిపుల్ అటాక్’ (చమురు + ఎల్ నినో + వేడి) వృద్ధి రేటును 7.6% నుండి 6.7%కి పడిపోయేలా చేసే ప్రమాదం ఉంది. నితిన్ కామత్ అన్నట్లుగా, మే నెలలోనే పరిస్థితులు ఇలా ఉంటే, ఏడాది చివరకు ఈ సవాళ్లు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి..! నిజంగానే, భారత ఆర్థిక వ్యవస్థకు ఇది అత్యంత క్లిష్టమైన సంవత్సరం కాబోతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
