Car Offers: ప్రస్తుతం ఆటో మొబైల్ కంపెనీలన్నీ సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. కస్టమర్లను ఆకర్షించుకునేందుకు మరిన్ని ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి జపనీస్ వాహన తయారీ సంస్థ నిస్సాన్ కూడా చేరింది. నిస్సాన్ తన కిక్స్ యూవీపై బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద మొత్తం 75 వేల రూపాయల వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది. నిస్సాన్ ఇండియా డీలర్‌షిప్ సెంటర్లలో కిక్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీని కొనుగోలు చేయడం ద్వారా రూ.20 వేల వరకు క్యాష్ బ్యాక్, రూ.50 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.5 వేల లాయల్టీ బెనిఫిట్స్పొందే అవకాశం ఉంది. వీటికి తోడు ప్రభుత్వ ఉద్యోగులు, అధిక సిబిల్ స్కోరు ఉన్న కస్టమర్లకు అదనపు ప్రయోజనాలను కూడా లభిస్తాయి. నిస్సాన్ కిక్స్ XL, XV, XV ప్రీమియం, XV ప్రీమియం (O) అనే మొత్తం నాలుగు ట్రిమ్ లెవల్స్‌లో అందుబాటులో ఉంటుంది. వీటిలో 1.3 -లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్, 1.5 -లీటర్ పెట్రోల్ ఇంజన్లను చేర్చింది. ఈ టర్బో మోటారు ఇంజిన్ గరిష్టంగా 154 బిహెచ్‌పి, 254 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరో ఇంజిన్ 105 బిహెచ్‌పి, 142 ఎన్‌ఎమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. కొనుగోలుదారులు మొత్తం ఐదు- స్పీడ్ మాన్యువల్, సిక్స్- స్పీడ్ మాన్యువల్, సివిటి ఆటోమేటిక్ ఇంజిన్లను ఎంపిక చేసుకోవచ్చు.
ఇక ఈ వేరియంట్లు ప్రస్తుతం రూ. 9.5 లక్షల నుంచి రూ. 14.65 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) మధ్య లభ్యమవుతున్నాయి. దీంతో పాటు నిస్సాన్ ఇటీవల తన డాట్సన్, డాట్సన్ గో వేరియంట్లపై ఆఫర్లను సైతం ప్రకటించింది. క్యాష్‌బ్యాక్, ఎక్స్చేంజ్ బెనిఫిట్స్వంటి వాటితో పాటు మెరుగైన సిబిల్ స్కోర్ఉన్న కస్టమర్లకు అదనంగా రూ.7 వేల తగ్గింపు అందించింది.
అలాగే అదనపు ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉంది. ఎలాగంటే.. కొనుగోలుదారుడు ప్రభుత్వ ఉద్యోగి లేదా 700 కంటే ఎక్కువ సిబిల్ రేటింగ్ కలిగి ఉండాలి. ఈ ఆఫర్లు ఎన్‌ఐసి ప్రారంభించిన డీలర్‌షిప్‌లో మాత్రమే లభిస్తాయని తెలిపింది. ధరలు వేరియంట్, కొనుగోలు చేసే ప్రదేశాన్ని బట్టి మారుతుంటాయి. ఈ ఆఫర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు సమీపంలోని తమడీలర్షిప్ సెంటర్‌ను సందర్శించాలని నిస్సాన్తెలిపింది.
Bajaj Pulsar: బంపర్ ఆఫర్.. కేవలం రూ.40 వేలకే బజాజ్ పల్సర్ బైక్.. ఎక్కడో తెలుసా..?