Nirmala Sitharaman: తెలుగింటి కోడలు నిర్మలమ్మ అరుదైన ఘనత.. ఆ రికార్డు సమం..

|

Feb 01, 2024 | 12:25 PM

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రేవేశపెట్టారు. అయితే, మధ్యంతర బడ్జెట్ కి సంబంధించిన కీలక విషయాలను పార్లమెంట్ లో వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో నిర్మలా సీతారామన్ అరుదైన ఘనతను సాధించారు.

Nirmala Sitharaman: తెలుగింటి కోడలు నిర్మలమ్మ అరుదైన ఘనత.. ఆ రికార్డు సమం..
Nirmala Sitharaman
Follow us on

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రేవేశపెట్టారు. అయితే, మధ్యంతర బడ్జెట్ కి సంబంధించిన కీలక విషయాలను పార్లమెంట్ లో వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో నిర్మలా సీతారామన్ అరుదైన ఘనతను సాధించారు. ఆరోసారి బడ్జెట్‌ ను ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్‌.. మొరార్జీ దేశాయ్‌ రికార్డును సమం చేశారు. అంతేకాకుండా.. వరుసగా ఆరోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఏకైక మహిళా కేంద్రమంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్.. వరుసగా ఐదు పూర్తిస్థాయి బడ్జెట్‌లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే, ఇప్పటి వరకు ఈ ఘనత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరు మీద మాత్రమే ఉంది.

మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10 సార్లు బడ్జెట్ ను సమర్పించగా.. పి చిదంబరం 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు, యశ్వంత్ సిన్హా 8 సార్లు సమర్పించారు. మన్మోహన్ సింగ్ 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టగా.. ఇప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు.

కాగా, ఈసారి కేంద్రం డిజిటల్ రూపంలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. సార్వత్రిక ఎన్నికల ముందు మోదీ సర్కారు చివరి బడ్జెట్‌ కావడంతో.. చిన్న బడ్జెట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తోన్న వేళ మధ్యంతర బడ్జెట్ అన్ని వర్గాలకు లాభం చేకూర్చేలా ఉండనుంది. అయితే, కేబినెట్‌ భేటీలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.. చివరి బడ్జెట్‌ బాగుంటుందని.. ఇది దేశానికి మంచి చేస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు.

బడ్జెట్ లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..