IT Jobs: కొత్త ఏడాదిలో కొలువుల జాతర.. ఆ రంగంలో భారీగా ఉద్యోగాల భర్తీ..!

దేశంలోని టెక్ రంగంలో కొలువుల జాతర మొదలవబోతోంది. సాఫ్ట్ వేర్ రంగంలో ప్రవేశించాలకునే వారికి అదిరిపోయే శుభవార్త వినిపించింది. కొత్త ఆర్థిక సంవత్సరంలో మన టెక్ పరిశ్రమ సుమారు 1.25 లక్షల కొత్త ఉద్యోగాలను కల్పించనుంది. ఈ మేరకు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీస్ కంపెనీ (నాస్కామ్) ఫిబ్రవరి 24న వార్షిక వూహాత్మక నివేదికను వెల్లడించింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది దాదాపు రెట్టింపు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది.

IT Jobs: కొత్త  ఏడాదిలో కొలువుల జాతర.. ఆ రంగంలో భారీగా ఉద్యోగాల భర్తీ..!
It Jobs

Updated on: Feb 26, 2025 | 2:30 PM

దేశంలో టెక్ పరిశ్రమ ప్రగతి పథంలో అడుగులు వేస్తోంది. అమెరియా, యూరప్ లోని కీలక మార్కెట్లలో స్థూల ఆర్థిక మందగమనం వల్ల ఏర్పడిన ఒత్తిడి నుంచి బయటపడింది. సుమారు ఏడాదిన్నర తర్వాత పుంజుకుంది. ఈ నేపథ్యంలో భారీగా ఉద్యోగులను నియమించుకోనున్నట్టు తెలుస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి భారత టెక్నాలజీ పరిశ్రమ ఆదాయం సుమారు 300 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. నాస్కామ్ అంచనా ప్రకారం టెక్ పరిశ్రమ సుమారు 5.1 శాతం అభివృద్ధిని సాధించే అవకాశం ఉంది. దీంతో 282.6 బిలియన్ల డాలర్లకు పరిశ్రమ మొత్తం ఆదాయం చేరింది. హార్డ్ వేర్ పరిశ్రమతోె కలిసి సుమారు 13.8 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది.

ఐటీ ఇండస్ట్రీలో ఐటీ సర్వీసెస్ కంపెనీలు, బిజినెస్ ప్రామిస్ మేనేజ్మెంట్ సంస్థలు, గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు, ఈ-కామర్స్ కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ ఆర్టిషీషియల్ ఇంటిలిజెన్స్ ను అందిపుచ్చుకోవడం, అజెంటిక్ ఏఐకి గిరాకీ ఏర్పడడం, పెరుగుతున్న జీసీసీల కారణంగా ఈ పరిశ్రమ ప్రగతిపథంలో పయనిస్తోంది. ఈ చర్యలు ఐటీ పరిశ్రమను కొత్త పంథాలో నడిపిస్తున్నాయి. ముఖ్యంగా బీఎఫ్ఎస్ఐ, హెల్త్ కేర్, రిటైల్ రంగాల్లోకి డిజిటల్ ఇంజినీరింగ్ ప్రవేశించింది. దీని వల్ల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడుతోంది. గతేడాది దాదాపు 2.50 లక్షల కొత్త ఉద్యోగాలు ఉంటాయని నాస్కామ్ అంచనా వేయగా, అది కేవలం 60 వేలకే పరిమితమైంది. అలాగే గతేడాది టెక్ రంగంలో 54.30 లక్షల ఉద్యోగులు ఉన్నారని భావించగా, ప్రస్తుతం ఆ సంఖ్య 56.74 లక్షలకు పెరగనున్నట్టు తెలిపింది. ఆర్థిక సంవత్సరాల వారీగా పెరిగిన వృద్ధి ని కూడా నాస్కామ్ వెల్లడించింది. అది 2023-24 ఫైనాన్సియల్ ఏడాదిలో నాలుగు శాతం, 2024-25లో 5.10శాతం నమోదైనట్టు తెలిపింది.

నాస్కామ్ అధ్యక్షుడు రాజేశ్ నంబియార్ తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు, అమెరికా పన్ను భయాలు ఆందోళలను కలిగిస్తున్నాయి. అయితే ఐటీ పరిశమ్రకు మాత్రం సానుకూలంగానే ఉన్నాయి. దీంతో ఈ రంగానికి ఆదాయం మెరుగ్గా ఉండే అవకాశం ఏర్పడింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగ ఆదాయం 300 బిలియన్ డాలర్లను అధిగమించాలంటే 6.1 శాతానికి పైగా వృద్ధి అవసరమవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..