New UPI Rule: యూపీఐ యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్ తీసుకురానున్న ఆర్‌బిఐ!

New UPI Rule: డిజిటల్ చెల్లింపుల్లో విప్లవం సృష్టించిన యూపీఐ (UPI) ద్వారా డబ్బు పంపడం ఇప్పుడు మరింత ఆలస్యం కానుందా? అంటే అవుననే అంటున్నాయి తాజా నివేదికలు. హ్యాకింగ్ కంటే కూడా, నేరస్థులు భయం లేదా ఆశ చూపించి బాధితుల చేతే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయిస్తున్నారు. ఇలాంటి సమయాల్లో 'ఒక గంట టైమ్' ఉంటే, బాధితులు ఆలోచించుకోవడానికి లేదా ఇతరులను సంప్రదించడానికి అవకాశం ఉంటుందని ఆర్‌బిఐ భావిస్తోంది..

New UPI Rule: యూపీఐ యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్ తీసుకురానున్న ఆర్‌బిఐ!
New Upi Rule

Updated on: Apr 11, 2026 | 7:00 AM

డిజిటల్ చెల్లింపుల్లో విప్లవం సృష్టించిన యూపీఐ (UPI) ద్వారా డబ్బు పంపడం ఇప్పుడు మరింత ఆలస్యం కానుందా? అంటే అవుననే అంటున్నాయి తాజా నివేదికలు. ఆన్‌లైన్ ఫ్రాడ్స్‌ను అరికట్టడానికి, సామాన్యుల సొమ్ముకు భద్రత కల్పించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక కీలక ప్రతిపాదనను సిద్ధం చేస్తోంది. దీని ప్రకారం.. పెద్ద మొత్తంలో చేసే నగదు బదిలీలపై ‘ఒక గంట గడువు’ విధించే అవకాశం ఉంది.

ఏమిటీ కొత్త ప్రతిపాదన?

ఒక వ్యక్తి తన అకౌంట్ నుండి మరొకరి అకౌంట్‌కు రూ.10,000 అంతకంటే ఎక్కువ నగదును డిజిటల్ పద్ధతిలో (UPI, IMPS మొదలైనవి) పంపినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ వెంటనే పూర్తి కాదు. బ్యాంకు ఆ మొత్తాన్ని ప్రాసెస్ చేయడానికి ఒక గంట సమయం తీసుకుంటుంది. ఈ లోపు ఆ ట్రాన్సాక్షన్‌లో ఏదైనా తప్పు ఉందని మీరు గుర్తిస్తే, దానిని రద్దు (Cancel) చేసే వెసులుబాటు కూడా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Dubai Gold: దుబాయ్‌లో తులం బంగారం ధర ఎంతో తెలుసా? మన దేశంలోని ధరలతో పోలిస్తే ఎంత తేడా?

ఎందుకు ఈ నిర్ణయం?

గత కొన్ని ఏళ్లుగా దేశంలో డిజిటల్ మోసాలు ఊహించని రీతిలో పెరిగాయి. 2021లో కేవలం 2.6 లక్షలుగా ఉన్న ఫ్రాడ్ కేసులు, 2025 నాటికి ఏకంగా 28 లక్షలకు చేరాయి. మోసాల వల్ల కోట్లల్లో నష్టం వాటిల్లుతోంది. మోసపోయిన సొమ్ము విలువ రూ.551 కోట్ల నుండి రూ.22,931 కోట్లకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

సైకలాజికల్ ఫ్రాడ్స్: హ్యాకింగ్ కంటే కూడా, నేరస్థులు భయం లేదా ఆశ చూపించి బాధితుల చేతే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయిస్తున్నారు. ఇలాంటి సమయాల్లో ‘ఒక గంట టైమ్’ ఉంటే, బాధితులు ఆలోచించుకోవడానికి లేదా ఇతరులను సంప్రదించడానికి అవకాశం ఉంటుందని ఆర్‌బిఐ భావిస్తోంది.

ఇది కూడా చదవండి: Gas Cylinder: ఆవు పేడతో గ్యాస్ సిలిండర్.. 18కేజీల గ్యాస్‌ జస్ట్‌ రూ.500లకే..!

మినహాయింపులు ఎవరికి?

  • అన్ని రకాల చెల్లింపులకు ఈ గంట గడువు వర్తించదు. దీనివల్ల సామాన్యుల రోజువారీ అవసరాలకు ఇబ్బంది ఉండదు.
  • మర్చెంట్ పేమెంట్స్: దుకాణాల్లో చేసే స్కాన్ అండ్ పేమెంట్స్‌కు ఈ రూల్ ఉండదు.
  • వైట్‌లిస్ట్: మీరు తరచుగా డబ్బు పంపే వ్యక్తులను ‘ట్రస్టెడ్’ లిస్ట్‌లో చేర్చుకుంటే వారికి వెంటనే డబ్బు చేరుతుంది.
  • ఇతర సేవలు: ఈ-మాండేట్, చెక్ పేమెంట్స్ మరియు NACH లావాదేవీలపై ప్రభావం ఉండదు.

వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక నిబంధనలు:

70 ఏళ్లు పైబడిన వారు లేదా దివ్యాంగులు పెద్ద మొత్తంలో డబ్బు పంపేటప్పుడు, వారి కుటుంబంలో ఒకరి (Trusted Person) అనుమతి ఉండాలనే నిబంధన రావచ్చు. ఏటా ఒక ఖాతాలోకి రూ.25 లక్షల కంటే ఎక్కువ నగదు వస్తే, అదనపు విచారణ జరిగేలా సిఫార్సు చేశారు.

తదుపరి అడుగు ఏమిటి?

ఈ కొత్త ప్రతిపాదనలపై ప్రజల నుండి, ఇతర సంస్థల నుండి ఆర్‌బిఐ మే 8, 2026 వరకు సూచనలు కోరింది. ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ ఇది అమలైతే యూపీఐ అంటేనే ‘Instant Payment’ అనే గుర్తింపు కొంత తగ్గే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Gold Reserves: అత్యధిక బంగారం ఏ దేశం వద్ద ఉంది? భారత్‌ ఏ స్థానంలో? టాప్‌ -5 దేశాలు ఇవే!

Hyderabad: హైదరాబాద్‌లో తక్కువ ధరలో ఇల్లు కొనాలా? నగరంలో బెస్ట్ లొకేషన్లు ఇవే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Loading...
Unable to load recommendations.
Follow Us