Insurance Policy: టీకా తీసుకుంటేనే పాలసీ ఇస్తారా?.. కొత్త నిబంధనలు తీసుకువస్తున్న బీమా కంపెనీలు

|

Jun 11, 2021 | 7:29 AM

Insurance Policy: కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ వేయించుకోవాల్సిందే. ఇక మీరు జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు కావాలంటే మాత్రం టీకా తీసుకుని..

Insurance Policy: టీకా తీసుకుంటేనే పాలసీ ఇస్తారా?.. కొత్త నిబంధనలు తీసుకువస్తున్న బీమా కంపెనీలు
Follow us on

Insurance Policy: కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ వేయించుకోవాల్సిందే. ఇక మీరు జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు కావాలంటే మాత్రం టీకా తీసుకుని ఉండాలి. ఈ మేరకు బీమా కంపెనీలు నిబంధనలు తీసుకువచ్చాయి. పరిస్థితులను బట్టి బీమా సంస్థలు పాలసీలను జారీ చేసే నిబంధనలు మారుస్తూ ఉంటాయి. కోవిడ్‌ తొలిదశ తర్వాత పాలసీల విషయాలలో నిబంధనలు తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకుంటున్నాయి.

సెకండ్‌వేవ్‌ తర్వాత అటు సాధారణ, ఇటు బీమా సంస్థలకు క్లెయిమ్‌ల భారీ మరింత పెరిగింది. దీంతో పాలసీలను ఇచ్చేటప్పుడే కొన్ని నిబంధనలను పాటించేందుకు సిద్ధం అవుతున్నాయి. ఒకసారి కరోనా సోకిన వ్యక్తికి పాలసీ ఇచ్చేందుకు బీమా సంస్థలు కనీసం 90 రోజుల వ్యవధిని పెడుతున్నాయి. ఆ తర్వాతే బీమా పాలసీలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. సాధారణంగా పాలసీలు ఇవ్వడానికి ఆరోగ్య బీమా పరీక్షలను అడుగుతుంటాయి. కోవిడ్‌-19 పాజిటివ్‌ ఎప్పుడు వచ్చింది, ఎన్నాళ్లు ఉంది, ఆసుపత్రిలో చేరారా.? లేదా ఒక వేళ ఆస్పత్రిలో చేరిని ఎన్ని రోజులు చికిత్స పొందారు..? ఎంత బిల్లు అయ్యింది తదితర వివరాలను అడుగుతున్నాయి.

కరోనా టీకా తీసుకుంటేనే టర్మ్‌ పాలసీ

అయితే మరి కొన్ని బీమా సంస్థలు మరో అడుగు ముందుకేశాయి. కరోనా టీకా తీసుకుంటేనే టర్మ్‌ పాలసీ ఇస్తామని కొత్త నిబంధనలు విధిస్తు్న్నాయి. ఒక బీమా సంస్థ 45 ఏళ్లు దాటిన వారు రెండు టీకా డోసులు తీసుకుంటేనే టర్మ్‌ పాలసీ ఇస్తానని చెబుతోంది. మరో సంస్థ ఒక డోసు టీకా తీసుకున్నా ఇబ్బంది లేదని, పాలసీ ఇస్తామని చెబుతోంది. కొన్ని బీమా సంస్థలు టీకాతో సంబంధం లేదని చెబుతూనే.. టీకా వేసుకున్నారా లేదా అనే ప్రశ్నను అడుగుతున్నాయి.

ఆరోగ్య బీమా సంస్థల్లో కొన్ని కొత్తగా పాలసీ తీసుకునే వారితోపాటు.. పునరుద్ధరణ చేసుకునే వారు టీకా వేసుకుంటే.. 5శాతం వరకూ రాయితీని ఇస్తున్నాయి. అందుకే, వ్యాక్సిన్‌ వేసుకున్న ప్రతి ఒక్కరూ తమ వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా తీసుకోవాలి. లేదంటే ఇలా బీమా తీసుకోవాలని అనుకునేవారికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

కొన్ని బ్యాంకులు కోవిడ్‌ 19 టీకా వేసుకున్న సీనియర్‌ సిటిజన్లకు అధిక వడ్డీని ఇస్తున్నాయి. యూకో బ్యాంకు టీకా వేసుకున్న పెద్దలకు డిపాజిట్లపై 0.3 శాతం అదనపు వడ్డీ ఇస్తోంది. యూకోవాక్సీ-999 పేరుతో 999 రోజుల వ్యవధికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ను అందిస్తోంది. ఇది సెప్టెంబరు 30 వరకూ అందుబాటులో ఉంది. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇమ్యూన్‌ ఇండియా డిపాజిట్‌ స్కీం పేరుతో 1111 రోజుల వ్యవధికి అందిస్తోన్న స్కీమ్‌లో 25 బేసిస్‌ పాయింట్లు అధిక వడ్డీని ఇస్తోంది. ఇలా కరోనా మహమ్మారి కారణంగా బీమా సంస్థలు రకరకాల నిబంధనలు విధిస్తున్నాయి. అందుకే బీమా తీసుకునే వారు టీకా వేసుకోవడం మంచిది. అంతేకాదు బీమా తీసుకోవాలంటే ఎలా నిబంధనలు ఉండాలో తెలుసుకోవడం మంచిది.

ఇవీ కూడా చదవండి:

SBI ATM:ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. గడువు ముగిసినా, కొత్త ఏటీఎం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండిలా..!

ATM Transaction: ఇక బాదుడే.. బాదుడు.. బ్యాంకు కస్టమర్లకు షాక్‌.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం

LPG Customers: గ్యాస్‌ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. భారీ ఊరట.. కొత్త సర్వీసులు అందుబాటులోకి..!