New Labour Law: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. కొత్త లేబర్ చట్టాలను అమలు చేయనుంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా లేబర్ చట్టాల్లో మార్పులు తేవాల్సిన అవసరం ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. జూలై 1 నుంచి ఈ కొత్త లేబర్ చట్టాలను అమల్లోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. కొత్త చట్టాలు అమల్లోకి వస్తే పనివేళలు, జీతం, ఈపీఎఫ్ వంటి వాటిలో మార్పులు వస్తాయి. ఇంతకీ కొత్తగా అమల్లోకి రానున్న ఈ కొత్త లేబర్ చట్టాల్లో ఉన్న అంశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* ప్రస్తుతం ఆర్జిత సేవలు పొందడానికి 240 రోజుల పరిమితిని 180 రోజులకు తగ్గుతుంది. ప్రతి 20 రోజుల పనికి 1 రోజు సెలవు లభిస్తుంది.
* కొత్త లేబర్ చట్టాలు అమల్లోకి వస్తే ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో నగదు భారీగా పెరుగుతుంది.
* అంతేకాకుండా ఉద్యోగులు పదవీ విరణమ చేసిన తర్వాత వచ్చే డబ్బు, గ్రాట్యుటీ మొత్తం కూడా పెరుగుతుంది.
* కొత్త లేబర్ చట్టాల్లు అమల్లోకి వస్తే 8-9 గంటలు ఉన్న పనివేళలను 12 గంటలకు పెంచుకోవచ్చు. అలాగే ఉద్యోగులకు మూడు వీక్లీ ఆఫ్‌లు ఉండే అవకాశం కూడా ఉంటుంది.
* కార్మికులకు ఓవర్ టైమ్ లిమిట్ 50 గంటల నుంచి 125 గంటల వరకు పెరుగుతుంది.
* ఉద్యోగి గ్రాస్ శాలరీలో.. బేసిక్ శాలరీ కనీసం 50 శాతంగా ఉండాలి. దీంతో జీతాల పెరుగుదలలో మార్పులు వస్తాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..