టెలికాం రంగంలో రిలయన్స్ జియో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు కొత్త కొత్త రీఛార్జ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. తక్కువ ధరల్లోనే మెరుగైన సేవలు అందించే విధంగా ప్లాన్స్‌ను రూపొందిస్తోంది. దేశంలో 5జీ సేవలను ప్రారంభించిన జియో.. పూర్తి స్థాయిలో దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఉచిత ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ కాల్స్ తో భారతీయ టెలికాం మార్కెట్‌లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన జియో ఇప్పుడు సంచలనానికి తెరతీసింది. పరిశ్రమలో మొదటి సారిగా అపరిమితమైన డేటా ఆఫర్‌తో ముందుకు వచ్చింది. రూ. 599 నెలవారీ ప్లాన్ ద్వారా కస్టమర్లు అపరిమితమైన వాయిస్ కాలింగ్, అపరిమితమైన 4G డేటా, రోజుకు 100 SMSలను పొందే వీలుంది.
అలాగే వినియోగదారులు, JioTV, JioCinema, JioCloudతో సహా మరిన్ని జియో యాప్ సేవలను ఉచితంగా పొందుతారు. జియో వెల్‌కమ్ ఆఫర్ కింద అర్హత కలిగిన వినియోగదారులకు అపరిమితమైన Jio True 5G డేటా కూడా లభిస్తుంది.
అలాగే ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్‌కు మారాలనుకొనే వారికి, ప్రీమియం సేవలను అనుభవించాలనుకునే కొత్త కస్టమర్‌లకు జియో ఈ ప్లాన్ 30-రోజుల ఉచిత ట్రయల్‌ని కూడా అందిస్తోందని జియో తెలిపింది. సరికొత్త 599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఇప్పటికే కస్టమర్లు ఆదరిస్తున్నట్లు తెలిపింది. రోజుకు కేవలం రూ. 19 అతి తక్కువ ఖర్చుతో వినియోగదారులు ఒకే ప్లాన్‌తో బహుళ ప్రయోజనాలను పొందడమే ఇందుకు ప్రధాన కారణం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి