Home Loan: కొత్త ఇల్లు కొనేవారికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఆదాయపు పన్ను(Income Tax) చట్టం- 1960 సెక్షన్ 80EEA కింద అందించే రూ.1.5 లక్షల పన్ను మినహాయింపును గృహ కొనుగోలుదారులు(House Buyers) ఇకపై పొందలేరు. దేశంలో అందరికీ ఇళ్లు పథకం కింద ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఈ వెసులుబాటును కల్పించింది. కానీ.. తాజాగా ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌లో 2022-2023 సంవత్సరానికి ఈ పన్ను మినహాయింపును కేంద్ర ప్రభుత్వం పొడిగించలేదు. ఈ పన్ను రాయితీ 2019-2022 ఏడాది వరకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కారణంగా..గృహాలు కొనుగోలు చేస్తున్న వారికి ఇకపై పన్ను రాయితీ పొందే అవకాశం ఇకపై లేనట్టేనని చెప్పుకోవాలి.
గృహకొనుగోలుదారులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24(B), సెక్షన్ 80సీ కింద రెండు పన్ను మినహాయింపులను పొందవచ్చు. రుణగ్రహీతలు సెక్షన్ 24(B) కింద వడ్డీపై మినహాయింపు రూ.2 లక్షల వరకు, సెక్షన్ 80సీ కింద అసలు మొత్తంపై రూ.1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాన్ని పొందవచ్చు. సెక్షన్ 24(B) కింద రూ.2 లక్షల కంటే ఎక్కువగా పన్ను రాయితీ అందుకొన్నవారు ఇల్లు కోసం తీసుకున్న గృహ రుణంపై చెల్లించే వడ్డీకి సెక్షన్ 80ఈఈఏ కింద రూ.1.5 లక్షల అదనంగా తగ్గింపును పొందే అవకాశం కల్పిస్తున్నారు. ఈ రెండు సెక్షన్లు 24(B), 80 ఈఈఏ కింద గృహ రుణాలపై చెల్లించే వడ్డీపై ఒక వ్యక్తి గరిష్ఠంగా రూ.3.5 లక్షల మినహాయింపును క్లెయిమ్ చేసుకొనే వీలు ఉంది. కానీ ఈ మినహాయింపు కొన్ని షరతులతో లభించనుంది.
ముందుగా ఏప్రిల్ 1, 2019 నుంచి మార్చి 31, 2022 మధ్య కాలంలో గృహ రుణం మంజూరు కావాలి. స్టాంప్ డ్యూటీ విలువ రూ.45 లక్షలకు మించి ఉండకూడదు. ఈ ప్రయోజనాన్ని పొందే వ్యక్తి రుణం మంజూరు చేసిన తేదీనాటికి మరే ఇతర ఇంటి ఆస్తిని కలిగి ఉండకూడదు.
రుణాన్ని ఆస్తికొనుగోలు కొరకు మాత్రమే ఉపయోగించాలి. రిపేర్, మెయింటెనెన్స్ లేదా నిర్మాణం కోసం కాదు. వ్యక్తులు మాత్రమే ఈ మినహాయింపును క్లెయిమ్ చేసుకోవాలి. మార్చి 31, 2022న లేదా అంతకు ముందు గృహ రుణాన్ని పొందిన వ్యక్తి, సెక్షన్ 80ఈఈఏ కింద ఈ మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. గృహ రుణం తీసుకున్న వ్యక్తి సెక్షన్ 80EEA ప్రకారం ఈ మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకసారి రుణం మంజూరు అయితే.. భవిష్యత్ ఆర్థిక సంవత్సరాల్లో గృహ రుణం పూర్తిగా తిరిగి చెల్లించే వరకు ఈ మినహాయింపును క్లెయిమ్ పొందవచ్చు.
ఇవీ చదవండి..
Black Stone: అత్యధిక జీతం తీసుకునేవాళ్లలో ఆయనే తోపు.. ఎంతో తెలిస్తే అవాక్కవుతారు..
Kim Jong-un: దూకుడు పెంచిన కిమ్ మామ.. అక్కడ అణు పరీక్షలకు ఏర్పాట్లు..