
భారతదేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫేక్ మెసేజ్‌ల గురించి తన ఖాతాదారులను హెచ్చరించింది. నకిలీ రివార్డ్ పాయింట్ రిడెంప్షన్ నోటిఫికేషన్‌ల గురించి కస్టమర్‌లకు ఇటీవల తరచూ మెసేజ్‌లు వస్తున్నాయని తెలిపింది. వివిధ రకాల బ్యాంకింగ్ ఛానెల్‌ల ద్వారా జరిగే సాధారణ లావాదేవీల కోసం ఎస్‌బీఐ తన కస్టమర్‌లకు కార్పొరేట్-వైడ్ లాయల్టీ ప్రోగ్రామ్‌గా పాయింట్లను అందిస్తుంది. అలాగే ఒక్కో పాయింట్ విలువ 25 పైసలుగా ఉంటుంది. చాలా మంది వినియోగదారులు తమ పాయింట్‌లను చాలా నెలలుగా రీడీమ్ చేయకపోవడంతో హ్యాకర్లు వాటిపై దృష్టి పెట్టి ఆ పాయింట్‌లను తస్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ తాజా హెచ్చరికల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఎస్‌బీఐ ఖాతాదారులు ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ ద్వారా వచ్చిన ఏవైనా లింక్‌లపై క్లిక్ చేయవద్దని లేదా ఏదైనా అప్లికేషన్‌లు లేదా ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయవద్దని బ్యాంక్ వినియోగదారులకు సూచించింది. పెరుగుతున్న స్పామ్, మోసాల సంఘటనల దృష్ట్యా ఎస్‌బీఐ తన కస్టమర్లను జాగ్రత్తగా ఉండాలని కోరింది. సైబర్ నేరగాళ్లు వినియోగదారులను మోసం చేయడానికి కొత్త విధానాన్ని అమలు చేయడం ప్రారంభించారని వివరించింది. ప్రధానంగా నకిలీ ఏపీకే లింక్‌ల ద్వారా రివార్డ్ పాయింట్‌లను రీడీమ్ చేయడానికి వినియోగదారులను అనుమతించేలా నటిస్తారు. ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ ద్వారా లింక్‌లను ఎప్పుడూ అందించదని బ్యాంక్ పేర్కొంది. వినియోగదారులను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. తెలియని వారికి ఏపీకే అంటే ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ. ఏపీకే అనేది పరికరాల్లో యాప్‌లను పంపిణీ చేయడానికి, ఇన్‌స్టాల్ చేయడానికి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించే అప్లికేషన్ ఫైల్ ఫార్మాట్. అయితే ఎస్‌బీఐ రివార్డ్ పాయింట్‌లను రీడీమ్ చేయడానికి మోసగాళ్లు ఏపీకేలు, ఎస్ఎంఎస్‌లను పంపుతున్నారని ఎక్స్ పోస్ట్‌లో బ్యాంక్ పేర్కొంది.
ఎక్స్ పోస్ట్ ప్రకారం ఎస్‌బీఐ ఎప్పుడూ ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ ద్వారా లింక్‌లు లేదా అయాచిత ఏపీకే అందించదు. అటువంటి లింక్‌లపై క్లిక్ చేయవద్దని లేదా తెలియని ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయవద్దని ఎస్‌బీఐ తన కస్టమర్లను కోరుతోంది. ఎస్‌బీఐ రివార్డ్జ్ ప్రోగ్రామ్‌లో నమోదు చేయబడతారు. మీరు అధికారిక వెబ్‌సైట్ మీ ఎస్‌బీఐ పాయింట్‌లను రీడీమ్ చేసుకోవచ్చు. పోర్టల్‌ను ఉపయోగించడానికి మీరు ముందుగా నమోదు చేసుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..