AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Okaya EV: స్టైలిష్ లుక్.. స్టన్నింగ్ రేంజ్.. ఒకాయా నుంచి కొత్త స్కూటర్ మామూలుగా లేదుగా..

చవకైన బడ్జెట్లో స్కూటర్లను అందించే ఒకాయా కంపెనీ కూడా మరో ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఒకాయా ఈవీ స్కూటర్లకు మంచి మార్కెట్ ఉంది. వీటిని మరింత పెంచకునేలా స్టైలిష్ డిజైన్ తో ఒకాయా మోటో ఫాస్ట్ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Okaya EV: స్టైలిష్ లుక్.. స్టన్నింగ్ రేంజ్.. ఒకాయా నుంచి కొత్త స్కూటర్ మామూలుగా లేదుగా..
Okaya Motofaast Electric Scooter
Follow us
Madhu

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 13, 2023 | 7:07 PM

ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్ శ్రేణి వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ప్రభుత్వాలు కూడా వీటినే అధికంగా ప్రోత్సహిస్తున్నాయి. మన దేశంలో కూడా నెమ్మదిగా వీటి వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఇక్కడ డిమాండ్ ఏర్పుడుతోంది అర్బన్ అవసరాలకు ఇవి బాగా ఉపయోగపడుతుండటంతో వీటిని అధికంగా కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో కంపెనీలు ఎలక్ట్రిక్ వేరియంట్ స్కూటర్లను మన దేశంలో విరివిగా లాంచ్ చేస్తున్నాయి. చవకైన బడ్జెట్లో స్కూటర్లను అందించే ఒకాయా కంపెనీ కూడా మరో ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఒకాయా ఈవీ స్కూటర్లకు మంచి మార్కెట్ ఉంది. వీటిని మరింత పెంచకునేలా స్టైలిష్ డిజైన్ తో ఒకాయా మోటో ఫాస్ట్ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

మోటోఫాస్ట్  ఎలక్ట్రిక్ స్కూటర్..

ఫెస్టివ్ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఒకాయా ఇన్నోవేటివ్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేస్తోంది. ఇప్పటికే ఉన్న ఫాస్ట్ ఎఫ్2బీ( FASST F2B), ఫాస్ట్ ఎఫ్2టీ(FASST F2T) వేరియంట్లకు తోడు అదనంగా మోటో ఫాస్ట్(Motofaast)ను లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ స్కూటర్లో అడ్వాన్స్ డ్ ఫీచర్లు ఉన్నాయి. ఇది కేవలం పర్యావరణ హితమైనదే కాకుండా స్టైల్, పనితీరులో కూడా అత్యద్భుతంగా ఉంటుంది. మన దేశీయ రోడ్లకు తగినట్లుగా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో ఈ స్కూటర్ వస్తోంది.

గరిష్ట వేగం.. ఈ మోటోఫాస్ట్ స్కూటర్ గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. పట్టణ ప్రాంతాలకు సరిగ్గా సరిపోతోంది. ముఖ్యంగా ట్రాఫిక్ ప్రాంతాల్లో అనువైన డ్రైవింగ్ ను అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

రేంజ్.. ఈ స్కూటర్ సింగిల్ చార్జ్ 120 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఎక్స్ టెండెడ్ రేంజ్ కూడా ఉంటుంది. ఇది వీకెండ్స్ లో లాంగ్ ట్రిప్స్ కి వెళ్లడానికి ఉపకరిస్తుంది.

బ్యాటరీ సామర్థ్యం.. దీనిలో లిథియం ఐరన్ ఫాస్పేట్(ఎల్ఎఫ్టీ) బ్యాటరీ తో వస్తుంది. ఇది ఓవర్ హీటింగ్ సమస్య లేకుండా అదనపు భద్రతను అందిస్తుంది. ఇది అధిక సంవత్సరాల లైఫ్ ను అందిస్తాయి.

ఫీచర్స్.. దీనిలో లైట్ వెయిట్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఇది స్టైలిష్ లుక్ ని అందిస్తాయి. ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ ఉంటుంది. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ ఫేస్ ఉంటుంది. మల్టీ మీడియా ఆప్షన్లు ఉంటాయి.

ధర, లభ్యత.. ఈ స్కూటర్ బ్లాక్, సియాన్, గ్రీన్, గ్రే, రెడ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ. 1లక్ష నుంచి రూ. 1.20 లక్షల వరకూ ఉంటుంది.

ప్రీ బుకింగ్స్ ప్రారంభం.. ఈ స్కూటర్ వచ్చే నెలలో గ్రాండ్ గా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. రూ. 2,500 టోకెన్ అమౌంట్ చెల్లించడం ద్వారా స్కూటర్ని ప్రీ బుక్ చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..