ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ మరో కొత్త ప్లాన్‌తో వినియోగదారుల ముందుకు వచ్చింది. జియో దూకుడికి కళ్లెం వేసేలా ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్‌ను ఎయిర్‌టెల్ ప్రవేశపెడుతుంది. ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్ నడుస్తున్న తరుణంలో వినియోగదారులను ఆకట్టుకునే ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ అందిచేలా రూ.149 ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఇప్పటికే రూ.148 ప్లాన్ అందుబాటులో ఉండగా రూ.149 ప్లాన్‌లో అధిక బెన్‌ఫిట్స్ కల్పిస్తూ వినియోగదారుల ముందుకు వచ్చింది. అయితే ఈ ప్లాన్ వల్ల కేవలం అదనపు ప్రయోజనాలను మాత్రమే వినియోగదారులు పొందగలరు. ప్రస్తుతం ఉన్న ప్లాన్ వ్యాలిడీటీతోనే ఈ ప్లాన్ వస్తుంది. అయితే అదనంగా ఓ 1 జీబీ డేటా మాత్రం కస్టమర్లకు అందిస్తుంది. అయితే వినియోగదారులు 30 రోజులు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ మాత్రం పొందుతారు. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం అనేది ఓ సమగ్ర ఓటీటీ కంటెంట్ ప్లాట్‌ఫామ్. ఈ ఒక్క యాప్ నుంచి 15 ఓటీటీ యాప్ కంటెంట్‌ను యాక్సెస్ చేయవచ్చు. మీరు ట్యాబ్, ఫోన్, డెస్క్‌టాప్ ద్వారా ఓటీటీ కంటెంట్‌ను యాక్సెస్ చేసేందుకు అవకాశం ఉంటుంది.
ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం కస్టమర్లకు అలవాటు చేసేందుకే ఎయిర్‌టెల్ ఈ కొత్త ప్లాన్ ప్రవేశపెట్టిందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీని ద్వారా ఇంటర్‌నెట్ వాడకం పెరగడంతో అదనపు రీచార్జ్ కస్టమర్లకు అవసరం అవుతుంది. అలాగే ఓటీటీ లవర్స్ కూడా అన్ని యాప్స్ సబ్‌స్క్రిప్షన్ అవసరం లేకుండా కేవలం ఓ యాప్‌తో అన్ని యాప్స్ వస్తాయంటే ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్రీమియంకు మారతారనే ఉద్దేశించిన ప్యాక్ ఇది. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓటీటీ లవర్స్ అయితే ఈ ఎయిర్‌టెల్ సరికొత్త ప్యాక్‌ను రీచార్జ్ చేసుకోండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..